డోనాల్డ్ బ్రాడ్‌మాన్
ఆస్ట్రేలియా దేశపు క్రికెట్ ఆటగాడు (1908–2001) From Wikipedia, the free encyclopedia
Remove ads
సర్ డోనాల్డ్ జార్జ్ బ్రాడ్‌మన్ (27 ఆగస్టు 1908–25 ఫిబ్రవరి 2001), తరచుగా ది డాన్ అని పిలువబడే, ఆస్ట్రేలియన్ క్రికెటర్, అతను ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మన్‌గా పరిగణించబడ్డాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని బ్యాటింగ్ సగటు 99.97,20 సంవత్సరాల క్రీడా జీవితంలో, బ్రాడ్‌మాన్ స్థిరంగా స్కోరులను నమోదు చేస్తూ, మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ బిల్ వుడ్‌ఫుల్ ఉద్దేశంలో "ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురు బ్యాట్స్‌మాన్‌లకు సమం" అని పేర్కొనే స్థాయికి చేరుకున్నాడు.[1] అతను కేవలం రెండేళ్లలో అట్టడుగు స్థాయి నుండి ఆస్ట్రేలియన్ టెస్ట్ క్రికెట్ జట్టులో చేరాడు. డాన్ చిన్న వయస్సులోనే కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అతను 22 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి, అనేక రికార్డులు సృష్టించాడు, వాటిలో కొన్ని ఇప్పటికీ అతని పేరుతోనే ఉన్నాయి. అతని స్కోర్‌ను నియంత్రించడానికి ప్రత్యేకంగా ఇంగ్లాండ్ బాడీలైన్ అని పిలిచే ఒక వివాదస్పద వ్యూహాలను రూపొందించింది. . 21 సంవత్సరాల మూడు నెలల పాటు కొనసాగిన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో అతను ప్రతి మూడు ఇన్నింగ్స్ లకు ఒకసారి సెంచరీ చేశాడు[2]. 1948ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పర్యటనలో చివరి టెస్టులో అతను 4 పరుగులు చేయగలిగితే, అతను ఈరోజు సగటున 100 పరుగులు చేసేవాడు, కానీ దురదృష్టవశాత్తు అతను సున్నా వద్ద అవుట్ అయ్యాడు, అందువలన అతని సగటు 99.94%. అతను 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6996 పరుగులు చేశాడు.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
Remove ads
గణాంకాలు
టెస్ట్ మ్యాచ్‌లలో ప్రదర్శన
అన్ని మ్యాచ్‌లలో ప్రదర్శన [ మూలాన్ని సవరించండి ]
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads