తుమ్మల వేణుగోపాలరావు

విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు. From Wikipedia, the free encyclopedia

తుమ్మల వేణుగోపాలరావు
Remove ads

తుమ్మల వేణుగోపాలరావు ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు. 1928 ఫిబ్రవరి 28న కృష్ణా జిల్లా ఘంటసాలపాలెంలో జన్మించాడు. కాకినాడ ఇంజినీరింగ్ కళాశాల, ఐఐటీ-ఖరగపూర్, ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయము లలో ఉన్నత ఇంజినీరింగ్ పట్టాలు పొందాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయము ఇంజినీరింగ్ కళాశాల, విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల, కోనేరు లక్ష్మయ్య ఇంజినీరింగ్ కళాశాల లలో ఆచార్యునిగా, ఏలూరు ఇంజినీరింగ్ కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపల్ గా, బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ గా దశాబ్దాలపాటు విద్యా సేవలందించాడు.

త్వరిత వాస్తవాలు తుమ్మల వేణుగోపాలరావు, జననం ...

వేణుగోపాలరావుకు రాష్ట్రములోని అభ్యుదయ, విప్లవ సంస్థలతో, సాహితీవేత్తలతో విడదీయరాని బంధం ఉంది. భార్య కృష్ణాభాయి విరసం వ్యవస్థాపక సభ్యులలో ఒకరు.[1]

  • విశాఖ పౌరహక్కుల సంఘ వ్యవస్థాపక సభ్యుడు.
  • భారత నాస్తిక సమాజ సభ్యుడు.
  • విజయవాడ వికాస విద్యావనం వ్యవస్థాపకుడు.
  • విశాఖపట్నం ఛాయా ఫిల్మ్ సంఘ స్థాపకుడు.

ఆత్యయిక పరిస్థితి సమయములో మీసా క్రింద బంధించబడ్డాడు.

ఆచార్య వేణుగోపాలరావుకు డా. నళిని, డా. పద్మిని అనే ఇద్దరు కుమార్తెలు. వీరు వైద్య, సంగీత రంగాలలో కొనసాగుతున్నారు.

వేణుగోపాలరావు 83వ ఏట సెప్టెంబరు 21, 2011 న మరణించాడు. మరణానంతరము కళ్ళు, భౌతిక దేహము ఆంధ్ర వైద్య కళాశాలకు దానం చేయబడ్డాయి.

Remove ads

పాత విద్యార్థుల ప్రశంస

  • కాకినాడ ఇంజనీరింగు కళాశాలలో, 1954 లో, వేణుగోపాలరావుగారు మొదటి సంవత్సరం విద్యార్థులకు "జియోమెట్రికల్ డ్రాయింగ్" బోధించేరు. మూడు దిశలలో వ్యాపించి ఉన్న ఘన రూపాలని ఒక కోణం గుండా చూస్తే ఎలా కనిపిస్తాయో కాగితం మీద ప్రక్షేపించి గీయడం అనేది ఇక్కడ లక్ష్యం. ఇది క్లిష్టమైన ప్రక్రియ. దీనిని బోధించడానికి ఆయన ఎంతో శ్రమ పడి, ఓర్పుతో వివరించి చెప్పేవారు. కాకినాడలో పాఠం బాగా బోధించిన వారిలో వేణుగోపాలరావు గారు ఒకరు. కాకినాడ తరువాత ఆయనని అర్బానా, ఇల్లినాయ్ లో కాకతాళీయంగా కలుసుకోవడం జరిగింది.
Remove ads

మూలాలు

ఇతర లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads