దేవరాయ (2012 సినిమా)

From Wikipedia, the free encyclopedia

Remove ads

దేవరాయ 2012, డిసెంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] నానికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, మీనాక్షి దీక్షిత్, విదిశ తదితరులు నటించగా, చక్రి సంగీతం అందించారు.[2]

త్వరిత వాస్తవాలు దేవరాయ, దర్శకత్వం ...
Remove ads

నటవర్గం

కథ

అమలాపురానికి చెందిన దొరబాబు. పైలాపచ్చీసుగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. అతనికి, అతని బృందానికీ లేని వ్యసనంలేదు. తాతముత్తాతలు సంపాదించిన ఆస్తిని హారతి కర్పూరం చేస్తూ గడిపేస్తుంటాడు. అదే ఊరికి చెందిన ఓ పెద్దాయన మనవరాలు స్వప్నను చూసి మోజుపడతాడు. ఆ తర్వాత అది ప్రేమగా మారుతుంది. ఇదిలా ఉంటే గోదావరి పరీవాహక ప్రాంతంలో శ్రీ కృష్ణదేవరాయలు కాలంనాటి కొన్ని వస్తువులు దొరుకుతాయి. అవి స్వయంగా రాయలవారే వినియోగించినవని పురావస్తుశాఖ అధికారులు తేలుస్తారు. పైగా దేవనాగరి లిపిలో ఓ గ్రంథమూ లభ్యమౌతుంది. అందులోని సమాచారాన్ని విశదీకరించమని సప్న తాతగారిని పురావస్తుశాఖ అధికారులు కోరతారు. మరో పక్క స్వప్నతో ప్రేమలో పడిన దొరబాబు ఓ సారి తమ ఊరి పొలిమేరలోని శిథిల దేవాలయం దిశగా వెళతాడు. అక్కడ గుడి బైట వారికో అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. దానిని చూడగానే దొరబాబులో ఊహించని మార్పులు కనిపిస్తాడు. ఈ లోగా దేవనాగరి లిపిలో ఉన్న గ్రంథాన్ని అధ్యయనం చేసిన పెద్దాయనకు అది రాయలు వారి ప్రియురాలు, నర్తకి సునంద రాసినదిగా అవగతమౌతుంది. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలకు, గోదావరి ప్రాంతంలోని నర్తకి సునందకు ఎలాంటి అనుబంధం ఉంది. రాయలు వారు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు, దేవాలయం బయట ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూడగానే దొరబాబులో ఎందుకు మార్పు వచ్చిందన్నది మిగతా కథ.[3]

Remove ads

పాటల జాబితా

శ్రీకృష్ణ రాయా, రచన: వెనిగళ్ల రాంబాబు, గానం.మాళవిక

హలలే హలలే, రచన: కందికొండ యాదగిరి, గానం.వినోద్ కాపు, ఆదర్శినీ

నిక్కర్ వేసినప్పుడు, రచన: పైడిసెట్టి, గానం.చక్రి, అంజనా సౌమ్య

బావలు, రచన: బాలాజీ, గానం.నేహ

గుచ్చి గుచ్చి, రచన: ప్రవీణ్ లక్మ, గానం.హరి, కౌసల్య

చక్కెర కేళి, రచన: కరుణాకర్, గానం.వేణు శ్రీరంగం, మాళవిక, ఫణి, సింహా

నీరాజనం, రచన: వెనిగళ్ళ రాంబాబు, గానం.కౌసల్య .

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: నానికృష్ణ (రాజులపాటి వెంకట కృష్ణారావు)
  • నిర్మాత: కిరణ్ జక్కంశెట్టి, నానికృష్ణ
  • రచన: వీరబాబు బాసిన
  • స్క్రీన్ ప్లే: రవిరెడ్డి మల్లు
  • సంగీతం: చక్రి
  • ఛాయాగ్రహణం: పూర్ణ
  • కూర్పు: నవీన్ నూలి
  • పంపిణీదారు: నానిగాడి సినిమా, సండే ఇంటర్నేషనల్ సినిమా

స్పందన

  • " సువిశాల విజయనగర సామ్రాజ్యాధిపతికి సంబంధించిన సినిమా అనగానే ఎందరిలోనో ఆసక్తి, ఆ సినిమా పట్ల అనురక్తి కలగడం సహజం. అయితే ఆ రెంటినీ నిలబెట్టుకోవడంలో 'దేవరాయ' చిత్రం విఫలమైంది. బాబర్ అడుగులకు మడుగులొత్తాల్సిన అవసరం లేదని రాయలు స్పష్టం చేయడం, తెలుగు భాష ఔన్నత్యం గురించి ఆయన మాటగా దొరబాబు నోటివెంట పలికించడం ప్రేక్షకులను పరవశింప చేస్తాయి. ప్రథమార్థం అంతా ద్వందార్థపు సంభాషణలతో కర్ణకఠోరం ఉంది. అక్కడికి సెన్సార్ సభ్యులు ఆ చెత్త మాటలు చెవిని చేరకుండా బీప్ శబ్దంతో రక్షించారు. దేవరాయలు జీవితాన్ని, ఆయన గొప్పతనాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్న దర్శక నిర్మాతలు నాని కృష్ణ, జక్కంశెట్టి కిరణ్ ప్రథమార్థంలోనూ కాస్త సంయమనం పాటించి, హుందాగా ఆ సన్నివేశాలను చిత్రీకరించి ఉంటే దర్శకుడికి మంచి పేరు వచ్చేది. " [3] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్ ఫిల్మ్‌ జర్నలిస్ట్
Remove ads

మూలాలు

ఇతర మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads