ద్రౌపది ముర్ము

భారతీయ రాజకీయవేత్త, భారత 15వ రాష్ట్రపతి From Wikipedia, the free encyclopedia

ద్రౌపది ముర్ము
Remove ads

ద్రౌపది ముర్ము (జననం:1958 జూన్ 20) 2022 జులై 25 నుండి భారతదేశ 15వ రాష్ట్రపతిగా అధికారంలో ఉన్న భారతీయ రాజకీయవేత్త. భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. ఆమె 2022 అధ్యక్ష ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిచింది.[2] ఆమె గిరిజన వర్గానికి చెందిన మొదటి వ్యక్తి, ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండవ మహిళ. ఆమె ఈ పదవిని ఆక్రమించిన అతి పిన్న(64 ఏళ్ళ వయసులో) వయస్కురాలు.[3][4]

త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...

గతంలో, ఆమె 2015 మే 18 నుండి 2021 జులై 12 వరకు జార్ఖండ్‌కు 8వ గవర్నర్‌గా పనిచేశారు. జార్ఖండ్ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుండి ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసిన జార్ఖండ్ మొదటి గవర్నర్.2000 నుండి 2009 వరకు రాయ్‌రంగ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఒడిశా శాసనసభ సభ్యురాలిగా, ఒడిషా ప్రభుత్వం రాష్ట్ర మంత్రిగా (స్వతంత్ర బాధ్యతలతో), 2000 నుండి 2004 వరకు పనిచేసారు. రాజకీయాల్లోకి రాకముందు, ఆమె 1979 నుండి 1983 వరకు రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్ శాఖలో క్లర్క్‌గా, ఆపై 1994 నుండి 1997 వరకు రాయరంగ్‌పూర్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది.[5]

Remove ads

రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం

ద్రౌపది ముర్ము 2022 జులై 25న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ లోని పార్లమెంట్ సెంట్రల్ హాలులో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం భారత 15వ రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించాడు.[6]

ప్రారంభ జీవితం

ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన ఊపర్‌బేడా గ్రామంలో గిరిజన జాతికి చెందిన సంతాల్ కుటుంబంలో 1958 జూన్ 20 న జన్మించింది.[7] ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు.[8][9] ఆమె తండ్రి, తాత లు పంజాయితీరాజ్ వ్యవస్థలోని గ్రామాధికార్లుగా ఉండేవారు.[10]

వ్యక్తిగత జీవితం

ద్రౌపది ముర్ము గ్రాడ్యుయేషన్ తర్వాత,ఒడిశా ప్రభుత్వంలో భువనేశ్వర్‌లోని సచివాలయంలో క్లరికల్ పోస్ట్‌లో చేరింది. ఆసమయం లో ఆమె రాయంగ్‌పూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో పనిచేసిన శ్యామ్ చరణ్ ముర్ము ని వివాహం చేసుకుంది[11]. దంపతులకు ఇద్దరు కుమారులు, ఇతిశ్రీ అనే కూతురు ఉంది. తన ఇద్దరు కుమారులలో ఒకరు 2009, ఇంకొకరు 2013 సంవత్సరంలో మరణించారు. ఆమె భర్త శ్యామ్ చరణ్ ముర్ము 2014లో మరణించారు, .[12]

జీవితం

ద్రౌపది ముర్ము భువనేశ్వర్ లోని రమాదేవి మహిళా కాలేజీ నుంచి బీఏ పూర్తి చేసి ఆ తర్వాత ఉపాధ్యాయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి, 1977-83 మధ్య ఒడిశాలోని నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా, 1994 నుంచి 97 వరకూ శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేసింది.[13]

రాష్ట్ర రాజకీయాలు

ద్రౌపది ముర్ము 1997లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాయ్‌రంగపూర్ నగర పంచాయితీ కౌన్సిలర్‌‌గా ఎన్నికైంది. ఆమె భారతీయ జనతా పార్టీ కి చెందిన గిరిజన తెగల మోర్చా కు ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలను అందించింది. ఆ తర్వాత 2000వ జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రాయరంగపూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో 2000 మార్చి 6 నుండి 2002 ఆగస్టు 6 వరకు వాణిజ్యం, రవాణాకు స్వతంత్ర బాధ్యతతో, 2002 ఆగష్టు 6 నుండి మే 2002 వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధికి శాఖ మంత్రిగా పని చేసింది.


ద్రౌపది ముర్ము 2004 లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రాయరంగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2002 నుంచి 2009 వరకు మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా,2006 నుంచి 2009 వరకు ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా, 2010లో మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలిగా, 2013 నుంచి 2015 వరకు మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలిగా, బీజేపీ ఒడిస్సా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా, బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వివిధ హోదాల్లో పని చేసింది. ద్రౌపది ముర్ముకు 2007లో ఒడిశా శాసనసభ ఉత్తమ శాసనసభ్యురాలిగా నికంఠ పురస్కారాన్ని అందించింది.

గవర్నర్‌గా

ద్రౌపది ముర్ము జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్[14] ఒడిశా నుండి భారతదేశంలోని ఒక రాష్ట్రంలో గవర్నర్‌గా నియమితులైన మొదటి మహిళ, గిరిజన నాయకురాలు.

రాష్ట్రపతి అభ్యర్థిగా

ద్రౌపది ముర్ము 2022లో జరగిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మొట్టమొదటి గిరిజన మహిళ రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించింది.[15][16]

రాష్ట్రపతి ఎన్నిక

2022 జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగగా, ఓట్ల లెక్కింపు జూలై 21న జరగగా రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే కావాల్సిన కోటా 5,28,491, ద్రౌపది ముర్ముకు 2,824 మొదటి ప్రాధాన్యత ఓట్లు (వాటి విలువ 6,76,803), ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,877 తొలి ప్రాధాన్యత ఓట్లు (వాటి విలువ 3,80,177) వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్లు కోటా కంటే ఎక్కువగా ఓట్లు రావడంతో ముర్ము గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించాడు.[17]

Remove ads

మూలాలు

బాహ్య లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads