ద్విదళబీజాలు
From Wikipedia, the free encyclopedia
Remove ads
తల్లి వేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపనం, చతుర్భాగయుత లేదా పంచభాగయుత పుష్పాలు, విత్తనంలో రెండు బీజదళాలు ఉండటం ద్విదళబీజాల (Dicotyledons) ముఖ్యలక్షణాలు.
Remove ads
వర్గీకరణ
పరిపత్రం (Perianth)లో ఉండే వలయాల సంఖ్య, ఆకర్షణపత్రాలు అసంయుక్తమా లేక సంయుక్తమా అనే అంశాలపై ఆధారపడి ద్విదళబీజాలను మూడు ఉపతరగగులుగా విభజించారు.
- ఉపతరగతి 1: పాలిపెటాలె లో పరిపత్రం రెండు వలయాలలో ఉండి, ఆకర్షణపత్రాలు అసంయుక్తంగా ఉంటాయి. పుష్పాసనం (Thalamus) ఆకారం ఆధారంగా దీనిని మూడు శ్రేణులుగా విభజించారు.
- శ్రేణి-థలామిఫ్లోరె (Thalamiflorae): దీనిలో పుష్పాసనం పొడవుగాగాని, శంకు ఆకారంలోగాని లేదా కుంభాకారంలోగాని ఉంటుంది. ఉదా: మాల్వేసి.
- శ్రేణి-డిస్కిఫ్లోరె (Disciflorae): దీనిలో పుష్పాసనం పళ్ళెం లేదా చక్రం వంటి ఆకారంలో ఉంటుంది.
- శ్రేణి-కెలిసిఫ్లోరె (Calyciflorae): దీనిలో పుష్పాసనం గిన్నె వంటి ఆకారంలో ఉంటుంది. ఉదా: ఫాబేసి.
- ఉపతరగతి 2: గామోపెటాలె లో పరిపత్రం రెండు వలయాలలో ఉండి, ఆకర్షణపత్రాలు సంయుక్తంగా ఉంటాయి. కేసరాలు ముకుటదళోపరిస్థితంగా ఉంటాయి. అండాశయం లక్షణాలు, పుష్పవలయాల్లో ఉండే భాగాల సంఖ్య ఆధారంగా దీనిని మూడు శ్రేణులుగా విభజించారు.
- ఉపతరగతి 3: మోనోక్లామిడె లో పరిపత్రం రక్షక, ఆకర్షణపత్రావళులుగా విభజన చూపించకుండా ఏకపరిపత్రయుతంగా ఉంటుంది. దీనిలో ఎనిమిది శ్రేణులున్నాయి.
Remove ads
ముఖ్యమైన కుటుంబాలు
- అంబెల్లిఫెరె (Apiaceae or Umbelliferae)
- అకాంథేసి (Acanthaceae)
- అనకార్డియేసి (Anacardiaceae)
- అనోనేసి (Annonaceae)
- అపోసైనేసి (Apocynaceae)
- అమరాంథేసి (Amaranthaceae)
- ఆస్టరేసి (Asteraceae or Compositae)
- కాక్టేసి (Cactaceae)
- కాజురైనేసి (Casuarinaceae)
- కారికేసి (Caricaceae)
- కుకుర్బిటేసి (Cucurbitaceae)
- థియేసి (Theaceae)
- డిప్టెరోకార్పేసి (Dipterocarpaceae)
- డ్రోసిరేసి (Droseraceae)
- పెపావరేసి (Papaveraceae)
- ప్లంబజినేసి (Plumbaginaceae)
- ఫాబేసి (Fabaceae or Leguminosae)
- బ్రాసికేసి (Brassicaceae or Cruciferae)
- బిగ్నోనియేసి (Bignoniaceae)
- మాగ్నోలియేసి (Magnoliaceae)
- మాల్వేసి (Malvaceae)
- మెనిస్పెర్మేసి (Menispermaceae)
- మిర్టేసి (Myrtaceae)
- మోరేసి (Moraceae)
- యుఫోర్బియేసి (Euphorbiaceae)
- రానన్కులేసి
- రామ్నేసి (Rhamnaceae)
- రూటేసి (Rutaceae)
- రూబియేసి (Rubiaceae)
- రోసేసి (Rosaceae)
- లామియేసి (Lamiaceae or Labiatae)
- వెర్బినేసి (Verbenaceae)
- వైటేసి (Vitaceae)
- సపిండేసి (Sapindaceae)
- సపోటేసి (Sapotaceae)
- సొలనేసి (Solanaceae)
Look up ద్విదళబీజాలు in Wiktionary, the free dictionary.
Remove ads
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads