నంది పురస్కారాలు

సినిమా, నాటక, టీవీ రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుయ్త్వం అందించే పురస్కారాలు From Wikipedia, the free encyclopedia

నంది పురస్కారాలు
Remove ads

నంది పురస్కారాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,, ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది. ఆ రోజులలో చిత్ర నిర్మాణము చాలా తక్కువగా ఉండేది, ఏడాదికి సుమారు 25 నుండి 30 వరకు చిత్రాలు మాత్రమే తయారవుతుండేవి. రాను రాను వాటి సంఖ్య 125 నుండి 130 వరకూ పెరిగింది. చిత్ర నిర్మాణం సరళి, నాణ్యత, ప్రమాణాలు తగ్గుతూ భారీ వ్యయ ప్రయాసలకు లోనవుతుంది. మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులూ కథకు 2 బహుమతులూ, మొత్తము 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ఇప్పుడు 42 నందులకు పెరిగినవి.

Thumb
2009 టెలివిజన్ - నంది పురస్కారాలు
Remove ads

నంది పురస్కారాలు

Remove ads

పేరు మార్పు

సినిమా, టెలివిజన్, రంగస్థల ఉత్తమ కళాకారులకు అందించే నంది పురస్కారాలను 2025 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌ పేరు మీదుగా ఇవ్వనుంది. దీనికి గాను మొత్తం పదిహేను మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీ ఏర్పాటు కాగా, జ్యూరీ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రముఖ సినీ నటి జయసుధ వ్యవహరిస్తుంది.[1]

ఇవి కూడా చూడండి

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads