నక్క

From Wikipedia, the free encyclopedia

నక్క
Remove ads

నక్క (సంస్కృతం: జంబుకము) ఒకరకమైన అడవి జంతువు. ఇది ఒక క్షీరదము, మాంసాహారి. కుక్క, తోడేలు మొదలగు జంతువుల కుటుంబమైన కానిడేకు చెందినది. ఈ జంతువు వేటాడము చాలా తక్కువ, పెద్ద జంతువులు తిని మిగిల్చిన ఆహారంపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంది. కళేబరాలను తిని, అడవుల పరిసరాలను ఓ విధంగా శుభ్రంగా వుంచుతుంది.

త్వరిత వాస్తవాలు నక్క, Scientific classification ...

నక్కలు అంటార్కిటికా ఖండంలో తప్ప మిగతా అన్ని ఖండాల్లోనూ కనిపిస్తాయి. అన్ని చోట్లా ఎక్కువగా కనిపించేది ఎర్రనక్క (రెడ్ ఫాక్స్) జాతి. వీటిలో మళ్ళీ 47 రకాలైన ఉపజాతులు ఉన్నాయి.[1] ప్రపంచంలో అన్ని చోట్లా ఉండటం వల్ల, అందరికీ వీటి జిత్తులమారితనం పరిచితం కాబట్టి పాపులర్ కల్చర్ లో, జానపదాల్లో వీటి ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వేట కుక్కల సాయంతో వీటిని వేటాడటం ఐరోపాలో ముఖ్యంగా బ్రిటిష్ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందింది. ఈ అలవాటును వీరు వలస ప్రాంతాల్లో కూడా కొనసాగించారు.

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads