నటన
From Wikipedia, the free encyclopedia
Remove ads
నటన (Acting) నటి లేదా నటుడు చేయు పని. ఇది రంగస్థలం, సినిమా, దూరదర్శన్ లేదా కథా కాలక్షేపాలలో ఒక వ్యక్తి మరొకరిని అనుకరించడం. ఇది ప్రాచీనకాలం నుండి బహుళ ప్రాచుర్యం పొందిన కళ.[1]

నటనను కొందరు వృత్తిగా స్వీకరించి తమ జీవితాల్ని అంకితం చేస్తే మరికొందరు దానినొక అలవాటుగా చేస్తున్నారు. నటులు ప్రదర్శించే దృశ్య ప్రదర్శనలను నాటిక, నాటకం అంటారు.
గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్థ్యం).
అయితే మరికొంతమంది నిజ జీవితంలో నటిస్తుంటారు. దీని మూలంగా ఆత్మవంచనతో వీరు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతారు. తత్త్వవేత్తలు మనిషిని ఒక నటుడిగా, ఈ ప్రపంచాన్ని ఒక రంగస్థలంగా సరిపోలుస్తారు.
Remove ads
నటనలో శిక్షణ
నటనలో పద్ధతులు ఉన్నాయి. కొంతమంది నటనలో శిక్షణ ఇస్తారు. అందుకోసం శిక్షణా సంస్థల్ని స్థాపించి నడిపిస్తారు. మన దేశంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (National School of Drama) నటన గురించిన ఉత్తమమైనది.
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads