నరేష్ గోయెల్
From Wikipedia, the free encyclopedia
Remove ads
నరేష్ గోయెల్, ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త. జెట్ ఎయిర్‌వేస్ స్థాపకుడు, చైర్మన్. 1993లో జెట్ ఎయిర్‌వేస్ను ప్రారంభించి, 2005లో షేర్ మార్కెట్లోకి దింపారు. ఫోర్బ్స్ పత్రిక నరేష్ ను భారతదేశంలో 16వ అత్యంత ధనికునిగా పేర్కొంది. ఈయన నికర విలువ 1.9బిలియన్ డాలర్లు.[5]
Remove ads
తొలినాళ్ళ జీవితం
1949లో పంజాబ్ లోని సంగ్రుర్ లో జన్మించారు నరేష్.[6] నగల డీలింగ్ వీరి కుటుంబ వ్యాపారం. చిన్నతనంలోనే నరేష్ తండ్రి మరణించారు. 6వ తరగతి వరకు బాలుర ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు ఆయన. ఆయన 11 ఏట ఆస్తిని కోల్పోయి, ఇంటిని వేలం కూడా వేసేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నడుమ తల్లిని ఆమె బంధువుల ఇంటికి తీసుకెళ్ళిపోయారు నరేష్. ఆ తరువాత కామర్స్ లో డిగ్రీ చదివారు ఆయన.[7]
కెరీర్
1967లో, నరేష్ తన మేనమామ సేఠ్ చరణ్ దాస్ రాం లాల్ ట్రావెల్ ఏజెన్సీ ఈస్ట్ వెస్ట్ ఏజెన్సీస్ లో క్యాషియర్ గా కెరీర్ ప్రారంభించారు. ఆయన మొదటి జీతం నెలకు 300 రూపాయలు. డిగ్రీ పట్టా పొందాకా, లెబనీస్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ లో ట్రావెల్ వ్యాపారం మొదలు పెట్టారు.[8]
1967 నుంచి 1974 వరకు వివిధ విదేశీ ఎయిర్ లైన్స్ తో ట్రావెల్ వ్యాపారం చేసి ఆ రంగంలో మంచి నైపుణ్యం సాధించారు గోయల్. ఆ సమయంలోనే వ్యాపారం కోసం అనేక దేశాలు తిరిగి అనుభవం గడించారు ఆయన.[8]
1969లో ఇరాక్ ఎయిర్‌వేస్ కు ప్రజా సంబంధాల మేనేజర్ గానూ, 1971 నుండి 1974 వరకు రాయల్ జోర్డేనియన్ ఎయిర్‌వేస్ ఎలియాకు ప్రాంతీయ మేనేజర్ గానూ పనిచేశారు. మధ్య ప్రాచ్య ఎయిర్ లైన్ కు చెందిన భారతీయ కార్యాలయంలో కూడా పనిచేశారు ఆయన. ఈ సమయంలో టికెటింగ్, రిజర్వేషన్ చేయడం, సేల్స్ వంటి విషయాలపై మంచి అనుభవం సంపాదించారు గోయల్.[7] 1974లో తన తల్లి వద్ద తీసుకున్న 500 యూరోలతో స్వంతంగా జెట్ ఎయిర్ అనే ఏజెన్సీని స్థాపించారు. ఈ ఏజెన్సీ ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కేథీ పసిఫిక్ ల ఏయిర్ లైన్స్ కు పనిచేస్తుంది.[6]
1975లో భారతదేశానికి ప్రాంతీయ మేనేజరుగా నరేష్ ను నియమించింది ఫిలిప్పైన్ ఇయిర్ లైన్[7]
Remove ads
జెట్ ఎయిర్‌వేస్
1991లో భారతదేశ ప్రభుత్వం ద్వారా ఓపెన్ స్కైస్ పాలసీ ప్రకటన చేయబడినప్పుడు, గోయల్ భారతదేశంలో డొమెస్టిక్ ఎయిర్‌వేస్ సేవలు మొదలుపెట్టేందుకు తగిన సమయంగా భావించి జెట్ ఎయిర్‌వేస్ స్థాపనకు శ్రీకారం చుట్టారు. మే 5, 1993న జెట్ ఎయిర్‌వేస్ తన వాణిజ్య సేవలు ప్రారంభించింది.[8] విదేశీ ఎయిర్ లైన్స్ సేవలను భారతదేశంలో అందించేందుకు గోయల్ జెట్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించారు.[9]
2004-2006 సంవత్సరాలకుగానూ గోయల్ అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ (ఐఎటిఎ) బోర్డులో సేవలందించారు. 2008లో తిరిగి అదే స్థానానికి ఎన్నికై జూన్ 2016 వరకు కొనసాగారు.[8]
వ్యక్తిగత జీవితం
తన కంపెనీలో పనిచేసే ఉద్యోగిని అనితను వివాహం చేసుకున్నారు నరేష్. ఆమె 1979లో మార్కెటింగ్ ఎనలిస్ట్ గా చేరి, మార్కెటింగ్, సేల్స్ కు ప్రధాన అధికారిణిగా పనిచేశారామె. పరిచయమైన 9 ఏళ్ళకు వీరు వివాహం చేసుకున్నారు.[6] వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు నివాన్ గోయల్, కూతురు నమ్రతా గోయల్[4]
అవార్డులు
Remove ads
References
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads