నారాయణపేట జిల్లా

తెలంగాణ లోని జిల్లాల్లో ఒకటి From Wikipedia, the free encyclopedia

నారాయణపేట జిల్లాmap
Remove ads

నారాయణపేట జిల్లా, తెలంగాణలోని జిల్లాలలో ఒకటి. 2019 ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు ప్రకారం ఈ జిల్లా కొత్తగా అవతరించింది.[2] ( 2019 ఫిబ్రవరి 17 నుంచి జిల్లా పాలన అమలులోకి వస్తుంది) 2022 జూలై 22న కొత్తగా రెండు మండలాలు ఏర్పడ్డాయి.దీని వల్ల 13 మండలాలు, 1 రెవెన్యూ డివిజన్ ఉన్నాయి. తెలంగాణలోనే ప్రాచీన సంస్థానాలలో ఒకటైన లోకపల్లి సంస్థానకేంద్రంగా వర్థిల్లిన నారాయణపేట పట్టణం కొత్త జిల్లాకు కేంద్రస్థానం అయింది.ఈ జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లాలోనివే.

త్వరిత వాస్తవాలు నారాయణపేట జిల్లా, దేశం ...

[3] 2022 జూలై 22న ప్రస్తుత మండలమైన మద్దూరు, కోస్గిని విభజించి కోస్గి నుండి గుండుమల్, మద్దూరు మండలాల నుండి కొత్తపల్లి కొత్త మండలాల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇవ్వబడింది.దీంతో మండలాల సంఖ్య 13కి చేరింది.

Remove ads

చరిత్ర

Thumb
నారాయణపేట జిల్లా

లోకపల్లి సంస్థానం పాలనాధీశులు చాలా కాలం పాటు నారాయణపేట కేంద్రంగా పాలించారు. మహారాష్ట్రీయులైన లోకపల్లి సంస్థానాధీశుల ప్రభావం ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉంది. సంస్థాన కాలం నాటి కోటలు, పురాతన భవనాలే కాకుండా ఇక్కడి ప్రజలపై మరాఠీ భాషా ప్రభావం కూడా ఉంది. 1948 సెప్టెంబరు 17న భారత యూనియన్‌లో విలీనమైన ఈ ప్రాంతం 8 సం.ల పాటు హైదరాబాదు రాష్ట్రంలో కొనసాగించి.1956 నవంబరు 1 నుంచి 2014 జూన్ 2 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్ గా ఉంది. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కూడా ఈ ప్రాంతం మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించి. ప్రత్యేక జిల్లాగా చేయాలనే ప్రతిపాదన రావడంతో 2018 డిసెంబరు 31న నారాయణపేట రెవెన్యూ డివిజన్ లోని 11, కోయిలకొండ మండలంతో 12 మండలాలలో జిల్లా ఏర్పాటుకు ముసాయిదా ప్రకటన వెలువడింది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కోయిలకొండ మండలాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగిస్తూ మిగితా 11 మండలాలతో 2019 ఫిబ్రవరి 16న నారాయణపేట జిల్లా ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు విడుదల చేసింది.[4]

Remove ads

జిల్లా లోని మండలాలు

  1. నారాయణపేట మండలం
  2. దామరగిద్ద మండలం
  3. ధన్వాడ మండలం
  4. మరికల్ మండలం
  5. కోస్గి మండలం
  6. మద్దూర్ మండలం
  7. ఊట్కూరు మండలం
  8. నర్వ మండలం
  9. మాగనూరు మండలం
  10. కృష్ణ మండలం
  11. మఖ్తల్ మండలం
  12. గుండుమాల్ మండలం
  13. కొత్తపల్లి మండలం

మాజీ కలెక్టర్లు

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads