పద్మ నది

From Wikipedia, the free encyclopedia

పద్మ నది
Remove ads

పద్మ నది, బంగ్లాదేశ్లో ఒక ప్రధానమైన నది. ఇది గంగా నది యొక్క ప్రధానమైన పాయ. దీన్ని పోద్దా అని కూడా అంటారు. రాజాషాహీ నగరం ఈ నది ఒడ్డున ఉంది.[1] 1966 నుండి ఈ నది కోత కారణంగా 256 చ.కి.మీ. భూభాగం కోసుకు పోయింది.[2] పశ్చిమ బెంగాల్, ముర్షీదాబాద్ జిల్లా లోని గిరియా వద్ద గంగా నది నుండి భాగీరథి పాయ చీలిపోయాక దిగువకు ప్రవహించే నదిని పద్మ నది అంటారు. చీలిన స్థలం నుండి ఆగ్నేయంగా 120 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతానికి దగ్గరలో మేఘన నదిలో కలుస్తుంది. భాగీరథిని హుగ్లీ అని కూడా అంటారు.

Thumb
బంగ్లాదేశ్‌లో పద్మ నది
Remove ads

భౌగోళికం

పద్మ నది చపాయ్ నవాబ్‌గంజ్ జిల్లా లోని శిబ్‌గంజ్ వద్ద భారతదేశం నుండి బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. అరిచా వద్ద జమునా నదిని (దిగువ బ్రహ్మపుత్ర) తనలో కలుపుకుంటుంది. చివరికి చాంద్‌పూర్ వద్ద మేఘన నదిలో కలిసి ఆపై బంగాళాఖాతంలో సంగమిస్తుంది.

ఆనకట్టలు

పశ్చిమ బెంగాల్లో ఫరక్కా బ్యారేజీని నిర్మించిన తరువాత పద్మ నది లోకి ప్రవాహం తగ్గిపోయింది. దీని వల్ల పద్మ నది పాయలు కొన్ని ఎండిపోయాయి. అనేక చేపల జాతులు మరణించాయి. బంగాళాఖాతం నుండి ఉప్పునీరు నది లోకి చొచ్చుకొచ్చి సుందర్‌బన్స్ లోమి మడ అడవులను దెబ్బతీసింది..[3]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads