పరిణీతి చోప్రా
From Wikipedia, the free encyclopedia
Remove ads
పరిణీతి చోప్రా (జననం 22 అక్టోబరు 1987)ప్రముఖ బాలీవుడ్ నటి. ఎన్నో జాతీయ ఫిలిం అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, నామినేషన్లు అందుకున్నారు. చాలా బ్రాండ్లకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు పరిణీతి.
ముందు పెట్టుబడి బ్యాంకింగ్ లో కెరీర్ ఎంచుకోవాలని అనుకున్నారు చోప్రా. కానీ వ్యాపారం,ఫైనాన్స్, ఎకనామిక్స్ లో మంచెష్టర్ బిజినెస్ స్కూల్ నుంచి ట్రిపుల్ హానర్స్ డిగ్రీ చేసిన తరువాత, 2009 లో ఆర్థిక మాంద్యం తరువాత భారతదేశానికి తిరిగి వచ్చేశారు ఆమె. ఇక్కడకు వచ్చాకా యశ్ రాజ్ ఫిలింస్ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్ గా పనిచేశారు. ఆ తరువాత అదే సంస్థకు నటిగా కొనసాగేందుకు ఒప్పందం చేసుకున్నారు పరిణీతి. 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం, ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ పొందారు ఆయన.
2012లో ఆమె నటించిన ఇష్క్ జాదే సినిమా కమర్షియల్ గా విజయం సాధించడమే కాక, విమర్శకుల నుండి ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమాలో ఈమె నటనకు జాతీయ ఫిలిం అవార్డు-స్పెషల్ మెన్షన్, ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్లు లభించాయి. ఆ తరువాత శుద్ధ్ దేశీ రోమాన్స్ (2013), హసీతో ఫసీ (2014)వంటి సినిమాల్లోని నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాల్లోని నటనతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది.[1]
Remove ads
తొలినాళ్ళ జీవితం, ఉద్యోగం

22 అక్టోబరు 1987న హర్యానాలోని అంబాలాలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు పరిణీతి.[2][3][4] ఆమె తండ్రి పవన్ చోప్రా వ్యాపారవేత్త, అంబాలా కంటోన్మెంట్ లో భారత సైన్యానికి సరఫరాదారుగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి రీనా చోప్రా. ఆమెకు ఇద్దరు సోదరులు శివాంగ్, సరజ్. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, మీరా చోప్రా, మన్నారా చోప్రా ఈమెకు కజిన్స్.[4][5][6][7][8] అంబాలా కంటోన్మెంట్ లోని కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు ఆమె.[9] ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరిణీతి మాట్లాడుతూ తాను చిన్నప్పట్నుంచీ చాలా మంచి విద్యార్థిని అని, మంచి మార్కులు వస్తుండేవనీ, ఎప్పుడూ పెట్టుబడి బ్యాంకర్ కావాలని అనుకునేవారని వివరించారు. తన 17 ఏటన మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ లో చదువుకునేందుకు లండన్ వెళ్ళిపోయారు.[10] విశ్వవిద్యాలయంలో కొత్త విద్యార్థులకు ఓరియెంటేషన్ తరగతులు చెప్పేవారు ఆమె.[11] చదువుకునేటప్పుడు మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్ బాల్ క్లబ్ కు క్యాటరింగ్ శాఖకు టీం లీడర్ గా పార్ట్ టైం పని చేసేవారు.[12]
Remove ads
వివాహం
ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని కపుర్తాలా హౌస్‌లో పరిణీతి చోప్రా ఎంగేజ్‌మెంట్ (నిశ్చితార్ధం) ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో 2023 మే 13న జరిగింది.[13] వీరి వివాహం సెప్టెంబర్ 24న ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జరిగింది. ఈ వివాహానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సానియా మీర్జా, హర్భజన్ సింగ్, మనీష్ మల్హోత్రా హాజరైయ్యారు.[14][15]
సినిమాలు
టెలివిజన్
డాక్యుమెంటరీ
డిస్కోగ్రఫీ
References
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads