పామే

From Wikipedia, the free encyclopedia

పామే
Remove ads

పామే కుటుంబం ఏకదళబీజాలకు చెందినది. వర్గీకరణ శాస్త్రవేత్త లిన్నేయస్ వీనిని "వృక్షసామ్రాజ్యపు రాకుమారులు" (Princes of Plant Kingdom) అని వర్ణించారు.

త్వరిత వాస్తవాలు పామే, Scientific classification ...
Remove ads

కుటుంబ లక్షణాలు

  • శాఖారహిత వృక్షాలు, పామ్ ఆకృతి.
  • విసనకర్ర వంటి లేదా ఈకల వంటి పత్రాలు.
  • స్పాడిక్స్ పుష్ప విన్యాసము.
  • ఏకలింగ పుష్పాలు, ఏకలింగాశ్రయి లేదా ద్విలింగాశ్రయి.
  • దృఢమైన పరిపత్రము.
  • కేసరాలు 3 + 3.
  • త్రిఫలదళ అండకోశము, ఫలదళాలు సంయుక్తంగా గాని, విడిగా గాని ఉండవచ్చును.
  • ఊర్ధ్వ అండాశయము, స్తంభ అండన్యాసము.
  • మృదుఫలము లేదా టెంకె గల ఫలము.
  • విత్తనం ఏకదళబీజయుతము, అంకురచ్ఛదయుతము.
  • వాయు పరాగ సంపర్కము.

ఉపయోగాలు

ఆహార పదార్ధాలు

  • పండ్లు: ఖర్జూరం, ఈత, తాటి వంటి 100 రకముల చెట్లనుండి రుచికరమైన పండ్లు లభిస్తాయి. తాటిపండ్ల రసం నుండి తాండ్ర, బెల్లం తయారుచేస్తారు.
  • విత్తనాలు: కొబ్బరి కాయలు అతిపెద్ద విత్తనాలు. దీనిలోని గుజురు మంచి ఆహారం. వివిధరకాలైన వంటలలో ఉపయోగిస్తారు. వక్క విత్తనాలు తాంబూలంలో విరివిగా వాడుతారు.
  • సగ్గుబియ్యం: కొన్ని రకాల చెట్టు కాండం మధ్యనున్న గుజ్జునుండి తయారుచేస్తారు.
  • పానీయాలు: కొబ్బరి బొండంలోని నీరు వేసవిలో దాహం తీరుస్తాయి. ఈత, కొబ్బరి, తాటి, జీలుగ చెట్లనుండి కల్లు తీస్తారు.
  • పువ్వులు: జీలుగు, వక్క చెట్ల కాబేజీలాంటి పువ్వులు కొందరు కొండజాతివారు తింటారు.
  • నూనెలు: కొబ్బరి నూనె, పామాయిలు వంటలో ఉపయోగిస్తారు.

కలప

  • తాటి మొదలైన చెట్ల భాగాలు గట్టిగా ఉండి ఇల్లు కట్టుకోవడంలో రకరకాలుగా ఉపయోగిస్తారు. కాండం కలపలాగా దూలాలు, స్తంభాలుగా ఉపయోగపడతాయి. తాటాకులు ఇంటికప్పు క్రింద, పందిరిగా వేస్తారు.
  • పేము కలపతో కుర్చీలు మొదలైన గృహోపకరణాలు తయారుచేస్తారు.
Remove ads

కొన్ని ప్రజాతులు

ఇవి కూడా చూడండి

మూలాలు

  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads