పాలపర్తి వెంకటేశ్వర్లు

From Wikipedia, the free encyclopedia

Remove ads

పాలపర్తి వెంకటేశ్వర్లు ఈపూరుపాలెం లో పేద వ్యవసాయ కుటుంబంలో లక్ష్మీకాంతమ్మ, పోలయ్యలకు పెద్ద కుమారుడిగా జన్మించాడు. స్టూవర్టుపురం పాఠశాలలో పదవతరగతి వరకు, ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు చీరాల వి.ఆర్‌.ఎస్‌. వై.ఆర్‌.ఎన్‌. కళాశాలలో చదివాడు. గ్రూప్‌-1 అధికారి నుంచి ఐఏఎస్‌ హోదా లభించి ఆదిలాబాద్‌ కలెక్టర్‌ అయ్యాడు. ఏప్రిల్ 6, 2010న కలెక్టరుగా ఆదిలాబాదు జిల్లాకు వచ్చి అందరి ఆదరాభిమానాలు పొందినాడు. కలెక్టరుగా సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా కాసిపేట మండల గిరిజనులు ఇతన్ని వెలుగు చూపిన దేవుడిగా కొనియాడారు.[1] నెల్లూరు జడ్పీ సీఈవోగా ,డీఆర్‌వోగా, తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్‌గా, రైతుబజార్ల ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) గా పనిచేశాడు. రెండో తమ్ముడు ఈపూరుపాలెం సర్పంచి. వెంకటేశ్వర్లు వెదుళ్ళపల్లి కి చెందిన అంజలిని వివాహం చేసుకున్నాడు.ఇతనికి ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి.

Remove ads

విశేషాలు

పాలపర్తి వెంకటేశ్వర్లు 2010 ఏప్రిల్‌ 5న అదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. విధి నిర్వహణలో అందరితో కలుపుగోలుగా ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేశాడు. లక్షెటిపేట మండలం దొనబండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 36 మంది మృతులకు దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశాడు. ఎండాకాలంలో తిర్యాణి మండలం కుర్రెఘడ్‌లో గిరిజన గూడెంలో కలుషిత నీరు తాగి ఆరుగురు గిరిజనులు మృతి చెందితే వైద్య బృందంతో గ్రామాన్ని సందర్శించాడు. అక్కడ మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాడు. ప్రాణహిత పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాడు. జిల్లాలో మూడు చోట్ల పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు. దీంతో కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్ని శాఖల నుండి నిధులు సేకరించి మూడు చోట్ల పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాడు. వర్షాకాలంలో ప్రాణహిత పరిసర గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఆ సమయంలో బెజ్జూర్‌, సిర్పూర్ ‌(టి) మండలాల్లో పర్యటించానని, ఇది తనకు మరిచిపోలేని సంఘటన అని అతను పలుమార్లు గుర్తు చేస్తుండేవాడు. జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలు వారి సమస్యలను నేరుగా కలెక్టర్‌కే తెలియజేసేందుకు 'మీ కోసం కలెక్టర్‌' కార్యక్రమాన్ని ప్రారంభించాడు. దళిత, గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారు.[2]

Remove ads

మరణం

పాలపర్తి వెంకటేశ్వర్లు ఆప్కో ఎమ్.డి.గా పనిచేస్తూ 2012, జూన్ 9 న మెదడు వ్యాదితో చనిపోయాడు.

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads