కండువా

పురుషుల సాంప్రదాయిక ఆహార్యం, భుజం మీద వేసుకునే వస్త్రం From Wikipedia, the free encyclopedia

కండువా
Remove ads

కండువా లేదా ఉత్తరీయము పురుషుల పెద్దరికానికి, హుందా తనానికి చిహ్నంగా కుర్తా పై అలంకరించుకొనే ఒక వస్త్రము. సాధారణంగా ఇది పంచె, కుర్తా ఏ రంగులో ధరించబడ్డవో అదే రంగులోనే ఉంటుంది. పంచెకు ఉన్న అంచే దీనికి కూడా ఉంటుంది. దీనిని కుడి చేత్తో ఎడమ భుజం పై వేసుకొంటారు. ఎండ, శారీరక శ్రమవలన ఏర్పడే చిరు చెమటలను తుడుచుకొనటానికి, నీటితో శుభ్రపరచిన చేతుల తడి తుడుచుకోవటానికి (టవల్ వలె) దీనిని ఉపయోగిస్తారు. అధిక శ్రమతో కూడిన పనులను చేసే సమయంలో దీనిని భుజం పై నుండి తీసివేసి తలపాగా వలె కట్టుకొంటారు.

Thumb
పెదరాయుడు చిత్రంలో కండువా ధరించిన రజినీకాంత్
Thumb
2021 హైదరాబాదులో జరిగిన ఆజాది కా కవి సమ్మేళన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. మామిడి హరికృష్ణ చేత సత్కారం అందుకుంటున్న ఘనపురం దేవేందర్.. ఇద్దరూ కండువా ధరించడం గమనించవచ్చు.

కండువా స్థానంలో కొందరు (అసాంప్రదాయికంగా) టవళ్ళను కూడా వాడతారు.

Remove ads

సినిమాలలో ఉత్తరీయం

  • పెదరాయుడు చిత్రంలో రజినీకాంత్ కండువా రెండు చేతులతో తిప్పి భుజంపై వేసుకొనే శైలి చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలచినది.
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads