ప్రియాంక చోప్రా
సినీ నటి From Wikipedia, the free encyclopedia
Remove ads
ప్రియాంక చోప్రా (జ. 1982 జూలై 18)[1] భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి. తన నటన జీవితాన్ని ప్రారంభించక ముందు, మోడల్‌గా పనిచేసిన ఆమె 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్న తరువాత ప్రసిద్ధికెక్కింది.
తమిళన్ (2002) అనే తమిళ చలన చిత్రం ద్వారా నటన జీవితం ప్రారంభించింది. తదుపరి సంవత్సరం, అనిల్ శర్మ దర్శకత్వంలో ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై (2003) ద్వారా ఆమె బాలీవుడ్ రంగప్రవేశం చేసింది కానీ అదే సంవత్సరంలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు పరిశ్రమలో తొలి విజయం లభించింది. ఈ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటి పురస్కారం లభించింది. 2004వ సంవత్సరంలో అబ్బాస్- మస్తాన్‌ల దర్శకత్వంలో వచ్చిన ఐత్రాజ్ (2004) చిత్రంలో విమర్శకులు సైతం మెచ్చుకొనేలా ప్రదర్శించిన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయిక పురస్కారం అందుకున్న రెండవ మహిళ అయ్యింది, తరువాత చోప్రా ముజ్సే షాది కరోగి (2004) చిత్రం, ఇప్పటివరకు తన చిత్రాల్లో అత్యంత వాణిజ్యపరమైన విజయాన్ని అందుకున్న క్రిష్ చిత్రం (2006), డాన్ - ది చేస్ బిగిన్స్ ఎగైన్ (2006) లాంటి ఎన్నో వాణిజ్య విజయాలను పరిశ్రమకు అందించింది. 2008వ సంవత్సరంలో ఫ్యాషన్ చిత్రంలో ప్రదర్శించిన నటనకు ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం కైవసం చేసుకుంది, ఈ విధంగా మంచి నటిగా స్థిరపడింది.[2]
Remove ads
ప్రాథమిక జీవితం
అశోక్ చోప్రా, మధు అఖౌరి వైద్య దంపతులకు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ లో చోప్రా జన్మించింది.[3] చోప్రా తన బాల్యాన్ని ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీలో, మస్సాచుసెట్ట్స్‌లోని న్యూటన్ ప్రాంతంలో, అయొవా లోని సీడర్ రాపిడ్స్ ప్రాంతంలో గడిపింది.[4] ఆమె తండ్రి సైన్యంలో వైద్యుడు కావటం వలన వారు తరచుగా ప్రాంతాలు మారుతూ ఉండేవారు. ఆమె తండ్రి బరేలీలో స్థిరపడిన పంజాబ్‌కు చెందిన ఖత్రి కుటుంబానికి చెందినవాడు, ఆమె తల్లి జమ్‌షెడ్‌పూర్‌లో స్థిరపడిన మలయాళీ కుటుంబానికి చెందినది. ఆమెకు ఆమె కంటే ఏడు సంవత్సరాలు చిన్నవాడైన సిద్ధార్థ్ అనే తమ్ముడు ఉన్నాడు.[5]
చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు చోప్రా బరేలిలోని సెయింట్ మరియా గోరెట్టి పాఠశాలలో, లక్నోలోని లా మార్టినీయర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసింది. భారత సైన్యంలో తన తండ్రి వైద్యుడు అయినందున వారు తరచుగా ప్రాంతాలను మారేవారు. పిమ్మట ఆమె యు.ఎస్.కు తరలి వెళ్ళి అక్కడ మస్సాచుసెట్స్ రాష్ట్రం, న్యూటన్ నగరానికి చెందిన న్యూటన్ సౌత్ ఉన్నత పాఠశాలలో, అయోవా లోని సీడర్ రాపిడ్స్ ప్రాంతంలోగల జాన్ ఎఫ్. కెన్నెడీ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించింది. తరువాత ఆమె భారత దేశానికి తిరిగివచ్చి బరేలీలోని సైనిక పాఠశాలలో ఉన్నత విద్య కొనసాగించింది. ముంబైలోని జై హింద్ కళాశాలలో తన కళాశాల విద్య ప్రారంభించింది కానీ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెల్చుకున్న తరువాత విరమించుకుంది.
Remove ads
ప్రపంచ సుందరి
మొదటగా భారత ప్రపంచ సుందరిగా ఎన్నిక అయిన చోప్రా తరువాత 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకుంది.[6] అదే సంవత్సరంలో లారా దత్తా, దియా మిర్జా విశ్వ సుందరి, ఆసియా పసిఫిక్ సుందరి కిరీటాలను కైవసం చేసుకున్నారు. ఇది ఒకే దేశానికి అరుదైన త్రిపుట విజయం.
ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఐదవ భారతీయ మహిళగా, ఏడు సంవత్సరాల కాలంలో కిరీటం దక్కించుకున్న నాల్గవ మహిళగా చోప్రా ప్రసిద్ధి గాంచింది.
Remove ads
నటనా ప్రవృత్తి
ప్రపంచ సుందరి బిరుదు దక్కించుకున్న తరువాత చోప్రా నటి అయ్యింది. బాలీవుడ్ పరిశ్రమలోనికి ప్రవేశించకముందు 2002వ సంవత్సరంలో విజయ్ సరసన తమిళ చిత్రం తమిళన్ ద్వారా చిత్రసీమలోకి రంగప్రవేశం చేసింది, ఈ చిత్రంలో ఆమె ఒక పాటను కూడా పాడారు. 2003వ సంవత్సరంలో తన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై విడుదలై మంచి సమీక్షలు అందుకుంది.[7] ఆ చిత్రాన్ని తక్కువగా అంచనా వేసినప్పటికీ ఆ సంవత్సరానికి అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం అయ్యింది.[8]
అక్షయ్ కుమార్ సరసన నటించిన ఆమె తర్వాత చిత్రం అందాజ్ విజయవంతంగా ప్రదర్శింపబడింది,[9] ఈ చిత్రంలో మంచి నటనకు ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ మహిళా రంగప్రవేశ పురస్కారం లభించింది, ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి ప్రతిపాదించబడింది. ఆమె తదుపరి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమైనాయి.[10]
2004వ సంవత్సరంలో ఆమె చిత్రం ముజ్సే షాది కరోగి చిత్రం విడుదలై ఆ సంవత్సరానికి అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా మూడో స్థానంలో నిలిచింది.[11] ఆమె తదుపరి హిందీ చిత్రం ఐత్రాజ్, డెమి మూర్ యొక్క డిస్‌క్లోజర్ అనే ఆంగ్ల చిత్ర పునర్నిర్మాణము. అది ఆమెకు మొట్టమొదటి ప్రతినాయిక పాత్ర. ఆమె నటన విమర్శకుల పొగడ్తలను సైతం పొంది ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయిక పురస్కారం తెచ్చిపెట్టింది. ఆమె ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి రెండో స్థానంలో ప్రతిపాదించబడింది. అదే సంవత్సరంలో, ఆమె, బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ రాణి ముఖర్జీ, ప్రీతి జింటా, అర్జున్ రాంపాల్‌లతో కలిసి టెంప్టేషన్స్ 2004 అనే ప్రపంచ పర్యటనలో పాల్గొంది.
2005వ సంవత్సరంలో ఎన్నో చిత్రాలు విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఏవీ సరిగ్గా జనాదరణ పొందలేదు.[12]
2006వ సంవత్సరంలో క్రిష్, డాన్ - ది చేజ్ బిగిన్స్ ఎగైన్ లాంటి అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఆమె నాయికగా నటించింది.[13]
నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన బహు తారల చిత్రం సలామ్-ఎ-ఇష్క్ : ఎ ట్రిబ్యూట్ టూ లవ్ 2007వ సంవత్సరంలో చోప్రా మొదటి చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.[14] చోప్రా మరుసటి చిత్రం బిగ్ బ్రదర్ కూడా విఫలమైంది.
2008వ సంవత్సరంలో ఆమె నటించిన ఆరు చిత్రాలు విడుదలైనాయి. మొదటి నాలుగు చిత్రాలు లవ్ స్టోరీ 2050, గాడ్ తుస్సి గ్రేట్ హో, చమ్కు, ద్రోణ విఫలమైనాయి.[15] అయినప్పటికీ ఆమె తదుపరి చిత్రాలు ఫ్యాషన్, దోస్తానా బాక్సాఫీస్ వద్ద 26,68,00,000, 44,42,00,000 రూపాయాలను వసూళ్లు చేశాయి [15], మునుపటి చిత్రంలో ఆమె ప్రదర్శనకు ఇతర పురస్కారాల నడుమ ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం లభించింది.
2009వ సంవత్సరంలో ఆమె విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలోని కమీనే చిత్రంలో, అశుతోష్ గోవారికర్ యొక్క వాట్స్ యువర్ రాశీ? చిత్రంలో, జుగల్ హన్స్‌రాజ్ యొక్క ప్యార్ ఇంపాజిబుల్‌లో కన్పించనుంది.[16]
Remove ads
విమర్శలు
2008వ సంవత్సరంలో హిందూస్తాన్ యూనీలీవర్ చోప్రాను పాండ్స్‌కు అధికార రాయబారిగా నియమించింది.[17] తరువాత ఆమె సైఫ్ అలీ ఖాన్, నేహా ధూపియాలతో పాటు చర్మ సౌందర్య ఉత్పత్తుల టెలివిజన్ వ్యాపార ప్రకటనలలో కనిపించింది, ఈ ప్రకటనలు జాతి వివక్ష భావనను లేవనెత్తినందుకు విస్తారంగా విమర్శింపబడ్డాయి.[18]
నటించిన చిత్రాలు
Remove ads
వీటిని కూడా చూడండి
- భారతీయ నటీమణుల జాబితా
- భారత సుందరి
- ప్రపంచ సుందరి
నమూనాలు
బాహ్య లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads