బాపట్ల జిల్లా

ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా From Wikipedia, the free encyclopedia

బాపట్ల జిల్లాmap
Remove ads

బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022 ఏప్రిల్ 4 న జరిగిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాత గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా ప్రాంతాలతో కొత్తగా ఏర్పరచిన జిల్లా. దీని పరిపాలనా ప్రధాన కార్యాలయం బాపట్ల. బాపట్లలో భారతీయ వాయుసేన కేంద్రం, దక్షిణ భారతదేశపు తొలి వ్యవసాయ విద్యాలయంతోపాటు, ఇతర విద్యాలయాలు ఉన్నాయి. ఐదో శతాబ్దం నాటిదైన భావనారాయణ స్వామి ఆలయం, భట్టిప్రోలు స్తూపం జిల్లా లోని చారిత్రక ప్రదేశాలు. బాపట్ల దగ్గర సూర్యలంక సముద్రతీరం, చీరాల దగ్గర ఓడరేవు ప్రముఖ పర్యాటక కేంద్రాలు.

త్వరిత వాస్తవాలు బాపట్ల జిల్లా, దేశం ...
Remove ads

చరిత్ర

భావనారాయణ స్వామి పేరిట పట్టణానికి భావపురి అనే పేరు వచ్చింది. అదే కాలాంతరాన రూపాంతరం చెంది భావపట్ల గా, బాపట్ల గా మారింది. నల్లమడ వాగు ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి బాపట్ల కేంద్రంగా కొత్త నల్లమడ జిల్లా ఏర్పాటు చేయాలని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు కొల్లా వెంకయ్య 1977లో తొలిసారిగా జిల్లా ప్రతిపాదన చేశాడు. దీనికి అప్పటి బాపట్ల ఎమ్మెల్యే కోన ప్రభాకరరావు కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం, ఉప సభాపతి కోన రఘుపతి కృషి, చొరవతో బాపట్ల కేంద్రంగా 2022 ఏప్రిల్ 4 న బాపట్ల జిల్లా ఏర్పాటైంది.[3] పూర్వపు ప్రకాశం జిల్లా నుండి కొంత భాగాన్ని, పూర్వపు గుంటూరు జిల్లా లోని కొంత భాగాన్ని కలిపి ఈ జిల్లాను ఏర్పరచారు.[4][5]

బాపట్ల తాలూకా 1794లో ఏర్పడింది. పట్టణంలోని టౌన్‌హాలులో 1913 మే 26, 27న నిర్వహించిన ప్రథమాంధ్ర మహాసభలలో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న భావనకు బీజంపడింది.[6] స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో 1919లో నిర్వహించిన చీరాల- పేరాల ఉద్యమం జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత సంతరించుకుంది.[3]

దక్షిణ భారతదేశంలో తొలిగా వ్యవసాయ కళాశాల బాపట్లలో 1945 జూలై 11న మొదలైంది. ఇక్కడే పేరొందిన బీపీటీ-5204 సాంబా మసూరి వరి వంగడాన్ని ప్రముఖ శాస్త్రవేత్త ఎంవీ రెడ్డి ఆవిష్కరించాడు. బాపట్ల జీడిమామిడి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తయారుచేసిన బీపీపీ-8 వంగడం ప్రాచుర్యంలోకి వచ్చింది.[3]

Remove ads

భౌగోళిక స్వరూపం

ఈ జిల్లాకు ఉత్తరాన గుంటూరు, పశ్చిమాన పల్నాడు, ప్రకాశం జిల్లాలు, దక్షిణాన బంగాళాఖాతం, తూర్పున కృష్ణా పశ్చిమ డెల్టా ఉన్నాయి.

భారీ నీటిపారుదల ప్రాజెక్టులు

వృక్ష సంపద

కోస్తా ప్రాంతంలో చీరాల, వేటపాలెం, చిన్నగంజాంలో జీడి మొదలైన చెట్లతో కూడిన అడవులు ఉన్నాయి.

రవాణా మౌలిక వసతులు

కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారి 16, దిగమర్రు- ఒంగోలు 216 జాతీయ రహదారి, ఓడరేవు- పిడుగురాళ్ల 167ఎ జాతీయ రహదారి, మేదరమెట్ల-అద్దంకి-నార్కట్పల్లి రహదారి జిల్లాలో ప్రముఖ రహదారులు. విజయవాడ- చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్లు ఉన్నాయి.[3] సమీప విమానాశ్రయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం.

విద్యా సౌకర్యాలు

ఆచార్య N.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి వ్యవసాయ కళాశాల, వివిధ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, గృహవిజ్ఞాన కళాశాల, బాపట్ల ఇంజినీరింగు కళాశాల, ఇక్కడ ఉన్నాయి. ప్రైవేటు రంగంలో ఇంజనీరింగు, ఫార్మసీ మొదలైన కళాశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి.

పరిపాలనా విభాగాలు

జిల్లాలో చీరాల, బాపట్ల, రేపల్లె రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారిక గెజెట్ 2022 ఆగస్టు 5 న ప్రకటించారు.[7] ఈ రెవెన్యూ డివిజన్లను 25 మండలాలుగా విభజించారు.

బాపట్ల జిల్లా మండలాల పటం (Overpass-turbo)

మండలాలు

Remove ads

పట్టణాలు

జిల్లాలో బాపట్ల, చీరాల, రేపల్లె, అద్దంకి పురపాలిక పట్టణాలు. వీటిలో చీరాల పెద్దది.[8]

గ్రామ పంచాయితీలు

జిల్లాలో 461 గ్రామ పంచాయితీలున్నాయి.[9]

రాజకీయ విభాగాలు

  • లోక్‌సభ నియోజకవర్గం
  1. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం దీని పరిధిలో బాపట్ల జిల్లా పూర్తిగా, ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం ఉంటుంది.
  • అసెంబ్లీ నియోజకవర్గాలు (6)[4]
  1. అద్దంకి
  2. చీరాల
  3. పరుచూరు
  4. బాపట్ల
  5. రేపల్లె
  6. వేమూరు

దర్శనీయ ప్రదేశాలు

Thumb
బాపట్ల జిల్లా దర్శనీయ ప్రదేశాలు (జుమ్ చేసి మౌజ్ సూచికలమీద ఉంచి వివరాలు, లింకులు పొందవచ్చు)

సముద్రతీరం

Thumb
సూర్యలంక తీరంలో ఆహ్లాదకరమైన సూర్యోదయ సమయం

కప్పలవారిపాలెం, పిన్నిబోయినవారిపాలెం సమీపంలో నల్లమడ వాగు,తూర్పు తుంగభద్ర, గుండంతిప్ప, రొంపేరు (కుడి) వాగులు సముద్రంలో కలుస్తాయి. బాపట్లకు 9 కి.మీ దూరంలో సూర్యలంక వద్ద ఉన్న సముద్ర తీరం (బీచ్) సముద్ర స్నానాలకు అనుకూలంగా ఉండి, ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. అలాగే చీరాల దగ్గర వాడరేవు, రామాపురం ఓడరేవు కూడా ప్రముఖ పర్యాటక కేంద్రాలు.

వ్యవసాయం

వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో 55 కి.మీ. మేర కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని లంక గ్రామాల్లో ఉద్యాన పంటల సాగు చేస్తారు. వీటిలో ప్రముఖమైనవి కంద, అరటి, తమలపాకు, నిమ్మ, గులాబీ.[3] బాపట్లలో వ్యవసాయ మార్కెట్ యార్డు ఉంది.

పరిశ్రమలు

రాష్ట్రంలో పొడవైన సముద్ర తీరప్రాంతం కలిగిన జిల్లాగా ఇది ఆక్వా రంగానికి కేంద్రంగావుంది. ఏటా రూ.1200 కోట్ల విలువైన రొయ్యలు, పిల్లలు, చేపలను ఎగుమతి చేస్తారు. చీరాల వస్త్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రం. గ్రానైట్ పరిశ్రమల కేంద్రంగా మార్టూరుకు గుర్తింపు ఉంది.[3]

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads