బాలు శంకరన్

భారతీయ విద్యావేత్త From Wikipedia, the free encyclopedia

బాలు శంకరన్
Remove ads

బాలు శంకరన్ ప్రొఫెసర్, శాస్త్రవేత్త , పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డుల గ్రహీత. కృత్రిమ అవయవాల తయారీ సంస్థను, పునరావాస సంస్థను స్థాపించడంలో ఇతడు సహాయపడ్డాడు.

త్వరిత వాస్తవాలు బాలు శంకరన్, జననం ...

జీవితవిశేషాలు

శంకరన్ 1926 సెప్టెంబర్ 4న తమిళనాడులో జన్మించాడు. 1948లో చెన్నై స్టాన్లీ మెడికల్ కాలేజీ నుండి వైద్య పట్టాతో పట్టభద్రుడయ్యాడు. ఇతడు యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లాండ్ దేశాలు పర్యటించి, 1951-1955 ల మధ్య కాలంలో కొలంబియా ప్రెస్బిటేరియన్ మెడికల్ సెంటర్ నుండి, 1955 లో మాంచెస్టర్ రాయల్ ఇన్ఫర్మరీ నుండి శిక్షణ పొందాడు.[1][2][3]

వృత్తి

మాంచెస్టర్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత. డాక్టర్ బాలు శంకరన్ ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్) లో చేరడానికి ముందు కెఎంసి మణిపాల్‌లో అనాటమీ విభాగంలో కొన్ని నెలలు బోధించాడు. శంకరన్ 1956లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్) లో ఆర్థోపెడిక్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. 7 సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన తరువాత, 1963లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది, 1967 వరకు ఎయిమ్స్లో కొనసాగాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడు, ఇతడు యునైటెడ్ స్టేట్స్ లోని చికాగో విశ్వవిద్యాలయం నుండి రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఫెలోగా ప్రాథమిక వైద్య పరిశోధనను చేశాడు. ఎయిమ్స్‌ తరువాత, ఇతడు 1970 వరకు మౌలానా ఆజాద్ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేశాడు. 1970 నుండి 1978 వరకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 1981లో జెనీవా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. 987 వరకు డబ్ల్యూహెచ్ఓతో కొనసాగాడు. 1992 నుండి 1994 వరకు భారత పునరావాస మండలి ఛైర్మన్‌గా వ్యవహరించాడు.

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు, 1972లో కాన్పూర్ లో భారత కృత్రిమ అవయవాల తయారీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డాడు. 1975లో భువనేశ్వర్ సమీపంలోని ఓలట్పూర్‌లో జాతీయ పునరావాస శిక్షణ, పరిశోధన సంస్థను స్థాపించడంలో సహాయపడ్డాడు. 1981 వరకు కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొనసాగాడు. ఇతడు ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ ఆసుపత్రిలో ప్రొఫెసర్ ఎమెరిటస్‌గా కూడా పనిచేశాడు.[4]

Remove ads

మరణం

స్వల్ప అనారోగ్యంతో 2012 జూన్ 20న ఆయన మరణించాడు.[5]

పురస్కారాలు

1971 బంగ్లాదేశ్ యుద్ధం లో గాయపడిన సైనికులకు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఇతడు అందించిన ట్రామా కేర్, పునరావాస సేవల కోసం 1972లో పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. 2007లో వైద్యశాస్త్రంలో పద్మవిభూషణ్ అవార్డును కూడా స్వంతం చేసుకున్నాడు.[1]

మూలాలు

బాహ్య లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads