బెంగుళూరు పద్మ
From Wikipedia, the free encyclopedia
Remove ads
బెంగుళూరు పద్మ రంగస్థల, చలనచిత్ర నటి, నృత్యకారిణి.[1] అనేక సినిమా లలో సహాయ నటిగా నటించింది.
Remove ads
జననం - విద్యాభ్యాసం
ఈవిడ అప్పలస్వామి, సుశీలా రాణి దంపతులకు కృష్ణా జిల్లా, విజయవాడ లో జన్మించింది. తండ్రి రైల్వే ఉద్యోగి అవడంతో బదిలీపై హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ లోనే పద్మ బాల్యం గడిచింది. ఎం.ఎ (హిస్టరీ) చదివింది.
వివాహం
రచయిత, నటుడైన అరుణ్ కుమార్ తో పద్మ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అబ్మాయి శ్రీనివాస్ ప్రసాద్, అమ్మాయి గాయత్రీరావు[2] లు కూడా నటులే. గాయత్రీరావు హ్యాపీ డేస్,[3] ఆరెంజ్[4], గబ్బర్ సింగ్, ఏకలవ్య వంటి సినిమాలలో నటించింది.
సినీరంగ ప్రస్థానం
నాలుగు సంవత్సరాల వయసులోనే సినీరంగంలోకి ప్రవేశించి, ఆలుమగలు చిత్రంలో అల్లు రామలింగయ్య పిల్లల్లో ఓ కూతురిగా నటించింది. ఆతర్వాత బొమ్మరిల్లు అనే చిత్రంలో బాలనటిగా నటించింది. చిరంజీవి నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రంలో చరణ్‌రాజ్ కి సహాయనటిగా చేసింది. అలా 150పైగా చిత్రాల్లో నటించింది.
నటించిన చిత్రాల జాబితా
- 2008: హోమం
- 2007: హ్యాపీ డేస్
- 2007: మధుమాసం
- 2006: మాయాబజార్
- 2004: నేనుసైతం
- 2003: మిస్సమ్మ
- 2003: దొంగరాముడు అండ్ పార్టీ
- 2002: ఆది
- 1997: ప్రేమించుకుందాం రా
- 1991: కూలీ నెం.1
- 1977: ఆలు మగలు
టీవిరంగం
టెలివిజన్ రంగంలో అనేక ధారావాహికల్లో నటించింది.
- అన్వేషిత (ఈటీవీ)
- గీతాంజలి (ఈటీవీ)
- శ్రావణమేఘాలు (ఈటీవీ)
- అభిషేకం (ఈటీవీ)
పురస్కారాలు
- 2023: ఉత్తమ నటి విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం (2021)[5]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads