బోడుప్పల్ నగరపాలక సంస్థ
From Wikipedia, the free encyclopedia
Remove ads
బోడుప్పల్ నగరపాలక సంస్థ, తెలంగాణ రాష్ట్రం, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లాలో కొత్తగా ఏర్పడిన నగరపాలక సంస్థ.ఇంతకుముందు బోడుప్పల్ మున్సిపాలిటి 2016 సంవత్సరంలో పూర్వపు రంగారెడ్డి జిల్లాలోని బోడుప్పల్, చంగిచెర్ల గ్రామ పంచాయతీల విలీనంతో ఏర్పడింది.[1] తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 211, తేది 2019 జూలై 23 లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడింది.[2] నగర ప్రాంతం 20.53 చ.కి. విస్తీర్ణంలో విస్తరించిఉంది. చర్లపల్లి వద్ద ప్రతిపాదిత రైల్ టెర్మినల్, పోచారం ఐటి పార్క్ వంటి పరిసరాలలో జరుగుతున్న పరిణామాలతో బోడుప్పల్ నగరం అధిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ తిరుపతిగా పిలవబడుతున్న[3] యాదగిరిగుట్ట ఆధ్యాత్మిక ప్రదేశం ఇక్కడకి 51 కి.మీ. దూరంలో ఉంది.దీని ముఖ్య పట్టణం బోడుప్పల్.
Remove ads
ఉనికి
బోడుప్పల్ నగరం హైదరాబాద్ ఎంజిబిఎస్ టెర్మినల్ నుండి 14 కి.మీ. దూరంలో, జిహెచ్ఎంసి పరిధిలోని ఉప్పల్ సర్కిల్కు ఆనుకొని 17.6297 7, 78.4814 రేఖాంశం కూడలిలో ఉంది. ఇది ఈశాన్య దిశలో రాష్ట్ర రాజధాని తెలంగాణకు 14 కి.మీ. దూరంలో, ఘట్కేసర్ మండల ప్రధాన కార్యాలయం నుండి కీసర వద్ద ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 25 కి.మీ. దూరంలో ఉంది.
2020 ఎన్నికల వార్డులు సంఖ్య
బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిని 2020 లో జరిగిన ఎన్నికలకు తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ వారిచే ఇరవై ఎనిమిది ( 28 ) వార్డులుగా విభజించబడింది.
మేయర్ , డిప్యూటీ మేయర్
2020లో జరిగిన సాధారణ ఎన్నికలలో మేయరు పదవికి (యుఆర్ జి) తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సామల బుచ్చిరెడ్డి ఎన్నికయ్యాడు.అలాగే డిప్యూటీ మేయరు పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొత్తలక్ష్మి ఎన్నికైంది.[4]
బడ్జెట్
2022-23: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల బడ్జెట్ కోసం జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో 12కోట్ల అభివృద్ధి పనులు ఆమోదించబడ్డాయి. 10 పడకల దవాఖాన నిర్మాణానికి రూ.50 లక్షలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సామగ్రి కొనుగోలుకు రూ.3 లక్షలు, రా చెరువు అభివృద్ధి, నాలా నిర్మాణం పొడిగింపునకు మరో రూ.4 కోట్లు, 2022 హరితహారానికి రూ. 5.93కోట్లు, పరిశుభ్రత, శానిటేషన్‌లో సామగ్రి కొనుగోలుకు రూ. 73.5 లక్షలు కేటాయించారు. పది బస్‌స్టాప్‌ల నిర్మాణం, బోడుప్పల్ నగరానికి 7 ముఖద్వారాల నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, స్థానిక కార్పోరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.[5]
Remove ads
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads