బ్రైడన్ కార్స్
From Wikipedia, the free encyclopedia
Remove ads
బ్రైడాన్ అలెగ్జాండర్ కార్స్ (జననం 1995 జూలై 31) దక్షిణాఫ్రికాలో జన్మించిన ఇంగ్లాండ్ క్రికెటరు. అతను డర్హామ్ కౌంటీ క్రికెట్ క్లబ్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్నాడు. ప్రధానంగా కుడిచేతి ఫాస్ట్ బౌలరు, కుడిచేతి వాటం బ్యాటరు. అతను నార్తాంప్టన్‌షైర్ తరపున ఇంగ్లాండ్‌లో ఆడిన జింబాబ్వే క్రికెటర్ జేమ్స్ అలెగ్జాండర్ కార్స్ కుమారుడు. బ్రైడన్ కార్స్ మంచి వేగంతో బౌలింగు చేస్తాడు. క్రమం తప్పకుండా 145కిమీ/గం వేగంతో వేస్తాడు. [1] అతను 2021 జూలైలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు.
Remove ads
దేశీయ కెరీర్
కార్స్ 2016లో డర్హామ్‌తో డెవలప్‌మెంట్ కాంట్రాక్ట్‌పై సంతకం చేసాడు. అతను అదే సంవత్సరం కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డర్హామ్ తరపున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు. [2] తన తొలి సీజన్‌లో 17 వికెట్లు తీసి, క్లబ్ నుండి రెండు సంవత్సరాల ఒప్పందాన్ని బహుమతిగా పొందాడు. [3] మోకాలి గాయం కారణంగా అతను 2018 కౌంటీ ఛాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు. [4] 2018 సెప్టెంబరులో, డర్హామ్ అతనికి మూడేళ్ల కాంట్రాక్ట్‌ను ఆఫర్ చేసింది.
2019 రాయల్ లండన్ వన్-డే కప్‌లో డర్హామ్ తరపున కార్స్ 2019 ఏప్రిల్ 17 న తన లిస్ట్ A రంగప్రవేశం చేశాడు. [5] 2022 ఏప్రిల్‌లో ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ అతన్ని కొనుగోలు చేసింది. [6]
Remove ads
అంతర్జాతీయ కెరీర్
కార్స్ తన పూర్వీకులు బ్రిటీషర్లైన కారణంగా ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు అర్హత పొందాడు. 2019లో అతని ఇంగ్లాండ్ రెసిడెన్సీ అర్హతను పూర్తి చేశాడు. 2021 జులైలో పాకిస్తాన్‌తో జరిగే సిరీస్ కోసం ఇంగ్లాండ్ వన్‌డే జట్టులో అతను ఎంపికైనప్పటికీ,[7] కోవిడ్-19 పాజిటివు అవడాన పర్యటన నుండి ఉపసంహరించుకున్నాడు.[8] కార్స్ తన వన్‌డే రంగప్రవేశం 2021 జూలై 8 నపాకిస్తాన్‌పై ఆడాడు. [9] 2021 జూలై 13 న పాకిస్తాన్‌తో జరిగిన మూడవ వన్‌డేలో కార్స్, వన్‌డేలలో తన తొలి ఐదు వికెట్ల పంట సాధించాడు. [10] [11] [12] 2022 మేలో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొన్న 14 మంది వన్‌డే జట్టులో కార్స్‌ని చేర్చారు. 2వ వన్‌డేలో కార్స్ తన వేగంతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతని వేగం 148 కిమీ/గం
అతను 2023 ఆగస్టు 30 న న్యూజిలాండ్‌పై తన T20 రంగప్రవేశం చేసాడు. గాయపడిన జోష్ టంగ్‌కి ప్రత్యామ్నాయంగా ఆడుతూ, 3-23తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ని గెలుచుకున్నాడు. [13]
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads