బ్లెయిర్ టిక్నర్
న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు From Wikipedia, the free encyclopedia
Remove ads
బ్లెయిర్ మార్షల్ టిక్నర్ (జననం 1993, అక్టోబరు 13) న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ తరపున ఆడేవాడు. 2019 ఫిబ్రవరిలో న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[1]
Remove ads
దేశీయ క్రికెట్
2017 నవంబరులో, 2017–18 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో వెల్లింగ్టన్‌తో జరిగిన సెంట్రల్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ కోసం మొదటి ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ సాధించాడు.[2]
2017-18 సూపర్ స్మాష్‌లో, పదకొండు మ్యాచ్‌లలో ఇరవై ఒక్క అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.[3] 2018 జూన్ లో, 2018–19 సీజన్ కోసం సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లతో ఒప్పందం లభించింది.[4]
అంతర్జాతీయ కెరీర్
2019 జనవరిలో, భారత్‌తో జరిగిన సిరీస్ కోసం న్యూజీలాండ్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[5] 2019, ఫిబ్రవరి 10న భారతదేశంపై తన టీ20 అరంగేట్రం చేసాడు.[6] 2020 ఫిబ్రవరిలో, భారత్‌తో జరిగే మూడో మ్యాచ్ కోసం టిక్నర్‌ను న్యూజీలాండ్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులోకి పిలిచారు.[7]
2020 నవంబరులో, పర్యాటక వెస్టిండీస్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం న్యూజీలాండ్ ఎ క్రికెట్ జట్టులో టిక్నర్ పేరు జాబితాలో చేర్చారు.[8][9] 2021 ఆగస్టులో, టిక్నర్ పాకిస్తాన్ పర్యటన కోసం న్యూజీలాండ్ వన్డే జట్టులో ఎంపికయ్యాడు.[10]
2022 ఫిబ్రవరిలో, దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం న్యూజీలాండ్ టెస్ట్ జట్టులో టిక్నర్ ఎంపికయ్యాడు.[11] నెదర్లాండ్స్‌తో స్వదేశంలో జరిగే సిరీస్ కోసం న్యూజీలాండ్ యొక్క వన్ డే ఇంటర్నేషనల్ జట్టులో టిక్నర్ ఎంపికయ్యాడు.[12] 2022 మార్చి 29న న్యూజీలాండ్ తరపున నెదర్లాండ్స్‌పై తన వన్డే అరంగేట్రం చేసాడు.[13]
2022 మే లో, టిక్నర్ ఇంగ్లాండ్ పర్యటన కోసం న్యూజీలాండ్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[14] 2023 ఫిబ్రవరి 16న న్యూజీలాండ్ తరపున ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.[15]
Remove ads
మూలాలు
బాహ్య లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads