భక్త కన్నప్ప (సినిమా)
From Wikipedia, the free encyclopedia
Remove ads
భక్త కన్నప్ప బాపు దర్శకత్వం వహించగా, కృష్ణంరాజు, వాణిశ్రీ, రావుగోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించిన 1976 నాటి తెలుగు భక్తిరస ప్రధాన చలనచిత్రం. సినిమాను గోపీకృష్ణా మూవీస్ పతాకంపై నటుడు కృష్ణంరాజు తమ్ముడు యు.వి.సూర్యనారాయణరాజు నిర్మించారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యంలోని ముఖ్యమైన భాగమైన తిన్నడు లేదా కన్నప్ప కథను స్వీకరించి సినిమాగా తీశారు. ప్రముఖ కవి ధూర్జటి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం కావ్యంలో ఆ క్షేత్రమహాత్యాల్లో భాగంగా ఈ కథాంశమూ ఉంది. 1954లో కొన్ని తేడాలతో ఈ కథాంశమే కాళహస్తి మహాత్యం సినిమాగా వచ్చింది, ఆ సినిమాలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటించారు.
Remove ads
నిర్మాణం
చిత్రీకరణ
తిన్నడి శ్రీకాళహస్తిలోనే జరిగినా సినిమా మాత్రం అక్కడ చిత్రీకరించలేదు. తిన్నడి కాలానికీ, 1970 వ దశకంలో శ్రీకాళహస్తికీ ఎన్నో మార్పులు వచ్చాయి. ఆనాటి వాతావరణం అక్కడ పునఃసృష్టి చేయడానికి అంత సులభం కాదు. అందుకని భక్త కన్నప్ప సినిమా చిత్రీకరణ బుట్టాయగూడెం, పట్టిసీమ, గూటాల తదితర ప్రాంతాల్లో జరిగింది. ఇక్కడి పరిసరాలు కాళహస్తి చుట్టుపక్కన ఉన్న ప్రాంతాలకు దగ్గరగా ఉంటాయి. ప్రధాన ఘట్టాలను కొన్ని శ్రీకాళహస్తి ఆలయంలో చిత్రీకరించారు.[2] బుట్టాయగూడెంలో గ్రామ ప్రముఖులైన కరాటం కృష్ణమూర్తి, కరాటం చంద్రయ్య, కుటుంబసభ్యులు సినిమా నిర్మాణానికి సహకారం అందించారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా వి.ఎస్.ఆర్. స్వామి, ఆపరేటివ్ కెమేరామేన్ గా ఎస్. గోపాలరెడ్డి వ్యవహరించి సినిమాను చిత్రీకరించారు. మేకప్ విభాగంలో మాధవయ్య, కృష్ణ, సత్యం, ఎ.సి.రాజు పనిచేశారు. కాస్ట్యూమ్స్ బి.కొండయ్య సమకూర్చగా, ఫైట్ మాస్టర్ గా రాఘవులు వ్యవహరించారు. బాపు సినిమాకు దర్శకత్వం వహించగా, ఆయనకు సహాయదర్శకునిగా కంతేటి సాయిబాబా పనిచేశారు.[3] సినిమా సెట్లు కొంతవరకూ కళాదర్శకుడు భాస్కరరాజు వేశారు. అయితే ఆయనకు వేరే అత్యవసరమైన పని ఏర్పడడంతో ఈ సినిమా వదిలేసి మద్రాసు వెళ్ళారు. దాంతో యుద్ధక్షేత్రం (ఎరీనా)ను నిర్మించే పనులు సగంలో నిలిచిపోయాయి. బాపురమణలు, నిర్మాత అందుకు బాపురమణల స్నేహితుడు, ఇరిగేషన్ డిపార్ట్ మెంటులో పనిచేస్తున్న బి.వి.ఎస్.రామారావు సరైన వ్యక్తి అని భావించి ఆయనకే ఆ బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు. మొదట సందేహించినా చివరకు రామారావు అంగీకరించి బాధ్యతలు వహించారు. ముందుగా అనుకున్నదానికన్నా పెద్ద ప్రహరీతో ఎరీనా సెట్ పూర్తచేశారు. సెట్టుని చక్కగా అలంకరించారు.[4]
Remove ads
పాటల జాబితా
1: ఆకాశం దించాల నెలవంక తుంచాల , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.వి.రామకృష్ణ, పి. సుశీల
2: కండ గెలిచింది కన్నె దొరికింది , రచన: సి నారాయణ రెడ్డి, గానం.వి.రామకృష్ణ , పి సుశీల
3: ఓం నమః శివాయ, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.వి.రామకృష్ణ
4:పరవశంమున్న శివుడు , రచన: వేటూరి సుందర రామమూర్తి,,గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
5: శివ శివ అననేలర , రచన: సి నారాయణ రెడ్డి గానం.ఎస్.జానకి
6: శివ శివ శంకరా , రచన వేటూరి సుందర రామమూర్తి, గానం.వి రామకృష్ణ
7: తల్లీ తండ్రి, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.పి.సుశీల
8: తినవయ్య,(మేల్ వాయిస్) రచన: వేటూరి సుందర రామమూర్తి ,గానం.వి.రామకృష్ణ
9:తినవయ్యా , ఫిమేల్ వాయిస్).రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం. పి సుశీల
10: తకిట తకిట , రచన :వేటూరి సుందర రామమూర్తి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
11: ఎన్నియల్లో ఎన్నియాల్లో చందమామ , రచన: ఆరుద్ర, గానం. వి . రామకృష్ణ, పి సుశీల.
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads