భారత ఉపఖండం
దక్షిణ ఆసియాలోని భౌతిక ప్రాంతం From Wikipedia, the free encyclopedia
Remove ads
భారత ఉపఖండము (ఆంగ్లం Indian Subcontinent) ఆసియా ఖండంలోని భాగము. ఈ ఉపఖండంలో దక్షిణ ఆసియా లోని భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు కలిసివున్నాయి. కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక, రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వుండటం మూలాన "ఉపఖండం" అనే పదం ఉపయోగంలోకి వచ్చింది.[1][2]
భౌగోళికం
భౌగోళికంగా, భారత ఉపఖండము ఒక ద్వీపకల్పం. హిమాలయాలకు, కుయెన్ లున్ పర్వతశ్రేణులకు దక్షిణాన, సింధూ నది, ఇరాన్ పీఠభూమికి తూర్పున, నైఋతి దిశన అరేబియా సముద్రం, ఆగ్నేయాన బంగాళాఖాతం కలిగి ఉంది. దీని విస్తీర్ణం 4,480,000 చ.కి.మీ. (1,729,738 చ.మైళ్ళు) లేదా ఆసియాఖండంలో 10 శాతం భాగాన్ని కలిగివున్నది. అలాగే జనాభా ఆసియాఖండపు జనాభాలో 40 శాతం జనాభా కలిగి ఉంది.
భౌగోళికంగా ఈ ప్రాంతం ఒక ఉపఖండం: ఇది టెక్టానిక్ ఫలకంపైనున్నది. భారత ఫలకం (ఇండో-ఆస్ట్రేలియన్ ఫలకానికి ఉత్తర భాగం) యూరేషియాకు వేరు చేస్తున్నది, యూరేషియా ఫలకాన్ని ఢీకొనక మునుపు, ఇదీ ఒక చిన్న ఖండంలా వుండేది. ఇలా ఢీకొన్న కారణంగానే హిమాలయా పర్వత శ్రేణులు, టిబెట్ పీఠభూమి ఏర్పడ్డాయి. ఈ ఫలకం నేడు ఉత్తరాన చలిస్తూ వుండడం కారణాన హిమాలయాల ఎత్తు పెరుగుతూ పోతున్నది. ఈ ఉపఖండపు పశ్చిమ సరిహద్దు యూరేషిన ఫలకానికి సరిహద్దు కలిగి ఉంది. అంతేగాక, ఈ ఉపఖండం, అనేకానేక భౌగోళికాంశాలైన గ్లేషియర్లు, వర్షారణ్యాలు, లోయలు, ఎడారులు, గడ్డి మైదానాలకు నెలవు.
Remove ads
వాతావరణం
ఈ ఉపఖండంలోని వాతావరణాన్ని ప్రధానంగా ఋతుపవనాలు నిర్దేశిస్తాయి. వేసవికాలం తేమగా ఉండి చలికాలంలో పొడిగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో ఋతుపవనాల ప్రభావం వలన కురిసే వర్షాల మూలంగా నార, తేయాకు, వరి, వివిధ రకాల కాయగూరలు పండుతాయి.
భౌగోళిక చరిత్ర
ఇయోసీన్ కాలంలో భారత ఉపఖండం ఒక ద్వీపఖండం లాగ హిందూ మహాసముద్రంలో ఉండేది. అంతకు పూర్వం ఈ భాగం గోండ్వానా భూభాగంతో కలిసి ఉండేది. ఈ భాగం ఆసియా ప్రధాన భూభాగంతో కలిసినప్పుడు ఏర్పడ్డవే హిమాలయాలు.
రాజకీయాలు
ఈ ఉపఖండంలో భారతదేశం ప్రధానమైన రాజకీయంగా శక్తివంతమైన దేశం.[3] ఇది అన్ని దేశాల కంటే పెద్దదిగా నాలుగింట మూడు వంతుల భూభాగాన్ని కలిగివున్నది.[4] జనాభా పరంగా మిగిలిన దేశాలన్నీ కలిపిన జనసాంద్రత కన్నా మూడు రెట్లు అధికంగా కలిగివున్న దేశం.[5] భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.[6] ఈ ప్రాంతంలో విస్తీర్ణంలోను, జనాభాలోను రెండవ అతిపెద్ద దేశం పాకిస్థాన్. ఇది జనాభా ప్రకారం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది.[7]
Remove ads
ఇది కూడా చూడండి
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads