భారత రాజ్యాంగ పరిషత్
భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పడిన ఏకసభ్య సమావేశం From Wikipedia, the free encyclopedia
Remove ads
గోపాల కృష్ణ గోఖలే 1914లో మొదటగా భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత 1934లో కమ్యూనిస్ట్ నాయకుడైన ఎం. ఎన్. రాయ్ రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకత తెలిపారు. 1935లో భారత జాతీయ కాంగ్రెస్ కూడా దీన్ని డిమాండ్ చేసింది. 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్తును స్థాపించటానికి అంగీకరించింది. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మొట్టమొదటి సారిగా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యులను రాష్ట్రాలు ఎన్నుకుంటాయి. మొత్తం 389 మంది సభ్యులలో 292 మంది రాష్ట్రాల నుండి, 93 మంది సంస్థానాల నలుగురు చీఫ్ కమీషనర్ ప్రావిన్సేస్ అఫ్ ఢిల్లీ, అజ్మీర్, కూర్గ్, బ్రిటిష్ బలోచిస్తాన్ నుండి ఎన్నికయ్యారు. ఆగస్టులో ఎన్నికలు పూర్తి అయ్యి కాంగ్రెస్ 208 స్థానాలను, ముస్లిం లీగ్ 73 స్థానాలు గెలుచుకున్నాయి. తర్వాత కాంగ్రెస్ తో విభేదించి ముస్లిం లీగ్ తప్పుకుని పాకిస్తాన్ కు వేరే పరిషత్ ని మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం జూన్ 3న స్థాపించారు. అలా విడిపోయిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ లో 299 స్థానాలు ఉన్నాయి.[1][2]
Remove ads
కమిటీలు చైర్మన్లు
- నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్
- రాజ్యాంగ సారథ్య సంఘం - డా. బాబు రాజేంద్రప్రసాద్
- స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
- జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
- ముసాయిదా కమిటీ - బి.ఆర్.అంబేద్కర్
- రాజ్యాంగ సలహా సంఘం - సర్దార్ వల్లభభాయి పటేల్
- ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
- అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
- రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
- ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ - జేబీ కృపలాని
- అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ - హెచ్‌సీ ముఖర్జీ
- యూనియన్ పవర్స్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
- కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
- కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
- సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ - వరదాచారి
- ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ - కేఎం మున్షీ
- ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ - గోపీనాథ్ బోర్డో లాయిడ్
- హౌస్ కమిటీ - భోగరాజు పట్టాభి సీతారామయ్య
- పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ - జి.వి.మావలాంకర్
- రాజ్యాంగ సలహా సభ్యుడు - బెనగల్ నర్సింగ్ రావు
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads