మనీషా కోయిరాలా
నటి, సామాజిక కార్యకర్త From Wikipedia, the free encyclopedia
Remove ads
మనీషా కొయిరాలా (జ. 16 ఆగస్టు 1970) ఒక నేపాలీ నటి. పలు భారతీయ భాషల సినిమాల్లో నటించింది. నేపాల్ లో కొయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈమె తండ్రి ప్రకాష్ కొయిరాలా. తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా నేపాల్ కు 22వ ప్రధాన మంత్రిగా పని చేశాడు. నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో అనేక ఇతర పురస్కారాలు అందుకుంది. 2001 లో ఈమె నేపాల్ రాజ ప్రభుత్వం ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంది.
కొయిరాలా పాఠశాలలో చదువుతుండగానే 1989 లో ఫేరి భేతౌలా అనే నేపాలీ సినిమాలో మొదటిసారి నటించింది. చిన్నప్పటి నుంచి వైద్యురాలు అవ్వాలనుకున్న ఆమె మొదట మోడల్ గా పని చేసింది. 1991 లో వచ్చిన హిందీ సినిమా సౌదాగర్ తో బాలీవుడ్ లో ప్రవేశించింది. తర్వాత వచ్చిన సినిమాలు వ్యాపార పరంగా సాధించకపోయిన 1942 - ఎ లవ్ స్టోరీ (1994), తమిళ చిత్రం బాంబే (1995) సినిమాలతో నాయికగా మంచి పేరు సంపాదించింది. తర్వాత వచ్చిన అగ్నిసాక్షి (1996), ఇండియన్ (1996), గుప్త్ - ది హిడెన్ ట్రూత్ (1997), కచ్చే ధాగే (1999), కంపెనీ (2000), ఏక్ చోటీసి లవ్ స్టోరీ (2002) సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.
Remove ads
మనీషా కోయిరాలా నటించిన తెలుగు చిత్రాలు
- భారతీయుడు (1996)
- క్రిమినల్
- ముంబాయి ఎక్స్ప్రెస్ (2005)
- నగరం (ప్రత్యేక నృత్యం)
టెలివిజన్
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads