మర్రి చెన్నారెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి From Wikipedia, the free encyclopedia

మర్రి చెన్నారెడ్డి
Remove ads

మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 - డిసెంబర్ 2, 1996) రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు.చేనేత, లఘు పరిశ్రమల శాఖ

త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
Remove ads

జననం

చెన్నారెడ్డి జనవరి 13, 1919న ప్రస్తుత వికారాబాదు జిల్లా, వికారాబాదు తాలూకాలోని మార్పల్లి మండలం లోని సిరిపురం గ్రామములో జన్మించాడు. ఇతని తండ్రి మర్రి లక్ష్మారెడ్డి.చెన్నారెడ్డి 1941లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందాడు. తర్వాతి రోజులో వరంగల్ లోని గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేశాడు తర్వాత రోజుల్లో ఆంధ్ర యువజన సమితి, విద్యార్థి కాంగ్రెసును స్థాపించాడు. ఇవే కాక అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత, సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనేవాడు.ఇతను హైదరాబాద్ అనే ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకత్వము వహించాడు. అంతే కాక అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించాడు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నాడు.1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1978 లో కాంగ్రెస్ చీలిక సమయంలో మర్రి చెన్నారెడ్డి శ్రీమతి ఇందిరాగాంధీ వర్గంలో చేరి అప్పటి సమైక్య ఇందిరా కాంగ్రెస్ అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు నాయకత్వ సారథ్యం వహించి సుమారు 175 నియోజక వర్గాలలో విజయం చేకూర్చి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టినారు.[1]

Remove ads

రాజకీయ జీవితం

గాంధీజీ పిలుపు మేరకు 1935లో ఆంధ్రమహాసభలో పాల్గొన్నారు. అది ఆయన రాజకీయ అరంగేట్రం. కార్యకర్తగా, సమావేశకర్తగా, ఖాదీ ప్రచారకుడుగా, గాంధేయుడుగా, విద్యార్థి నాయకుడుగా, ఆంధ్ర విద్యార్థి కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడుగా అనేక స్థాయిల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. 1938లో జైలు శిక్షను అనుభవించారు.[2]

మరణం

డిసెంబర్ 2,1996లో చెన్నారెడ్డి మరణించాడు. ప్రస్తుతం చెన్నారెడ్డి సమాధి హైదరాబాదులోని ఇందిరా పార్కు ఆవరణలో ఉంది. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజా సమితి పార్టీ పెట్టి అన్ని సీట్లు గెలిచి, ఆ పార్టీని కాంగ్రెసులో విలీనం చేశాడు.

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads