మహానాడు
నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం From Wikipedia, the free encyclopedia
Remove ads
మహానాడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సంబంధించి ప్రతీ సంవత్సరం జరిగే పార్టీ కార్యక్రమం.[1] ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఏజెండాలను వివిధ సమస్యలపై పార్టీ తీర్మాలను ప్రకటిస్తారు. ఇది మూడు రొజులు కార్యక్రమం. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు వస్తారు. ఈ కార్యక్రమంలోనే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో ‘మహానాడు’ ముఖ్యమైంది. ప్రతి సంవత్సరం మే 27 నుంచి 29 వరకు మహానాడును జరుపుతుంటారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. [2]

పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి ఏటా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మదినం నాడు మహానాడు కార్యక్రమాలను ఏదో ఒక నగరంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.. ఈ సమావేశాల్లో రాబోయే సంవత్సర కాలంలో పార్టీ నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళికను తయారవుతుంది.[3]
Remove ads
విశేషాలు
1985, 1991, 1996 సంవత్సరాల్లో మహానాడును నిర్వహించలేదు. 1985, 1996 సమయాల్లో టీడీపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 2012లో కూడా టీడీపీ మహానాడును వాయిదా వేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.[4]
2018 లో జరిగిన మహానాడు చివరిసారి సెషన్లలో, పార్టీ అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ ప్రాజెక్ట్, ఐటి, దాని ప్రమేయం, నీటి మెరుగుదల, రైతుల అభ్యున్నతి, రాజకీయాలలో మహిళల ప్రమేయం, సాధికారత మొదలైన వాటి గురించి చర్చించింది.[5]
Remove ads
ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు
తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు హైదరాబాదులో 2022 మార్చి 29న, మహానాడును విజయవాడలో 2028 మే 28న జరగనున్నాయి. ఈ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు ఈ ఏడాదిపాటు వేడుకగా జరగనున్నాయి.[6]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads