మహా శ్వేతాదేవి
భారతీయ రచయిత From Wikipedia, the free encyclopedia
Remove ads
మహా శ్వేతాదేవి (జనవరి 14, 1926 - జూలై 28, 2016) ( (బెంగాలీ: মহাশ্বেতা দেবী ) పశ్చిమ బెంగాల్కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత, సామాజిక కార్యకర్త.
ఆమె 1926లో ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకాలో జన్మించింది. ఆమె తండ్రి మనిష్ ఘటక్ కూడా కవి, నవలా రచయిత. తల్లి ధరిత్రి దేవి కూడా రచయిత, సామాజిక కార్యకర్త.
Remove ads
తొలి జీవితం
1926 లో జన్మించిన ఆమె విద్యాభాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగింది. స్వాతంత్ర్యం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు మార్పుచేయడంతో ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంములో ఆంగ్లంలో డిగ్రీ, కోల్‌కత విశ్వవిద్యాలయము నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేసింది. నటుడు బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకుంది.
రచనలు
- ఎతోవా పోరాటం గెలిచాడు.
మహాశ్వేతాదేవి ఎతోవా అనే గిరిజన బాలుడు జీవితంలో ఎలా విజయం సాధించాడన్న విషయంపై ఈ నవల రచించారు. ఈ నవలను తెలుగులోకి చల్లా రాధాకృష్ణమూర్తి అనువదించాడు. బాలలకు తేలిగ్గా అర్థమయ్యేలాగా ఈ రచన చేశారు. పిల్లలకు ఆసక్తి కలిగించేవిధంగా పుస్తకంలో చక్కని చాయాచిత్రాలు జతచేశారు. ఈ గ్రంథం వల్ల మన దేశంలోనే ఉంటూనే చాలామందికి తెలియని గిరిజనుల సంస్కృతి, వారి పోరాటాలు, జీవితంలో లక్ష్యాలు, వాటీని సాధించేందుకు వారు ఎంచుకోవాల్సిన కష్టభరిత ప్రయాణం వంటివి ఎన్నో తెలుస్తాయి.
Remove ads
అవార్డులు
- 2006లో భారత ప్రభుత్వపు రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ అవార్డు లభించింది.
- 2004లో ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం లభించింది.
- 1997లో రామన్ మెగ్సేసే అవార్డు స్వీకరించింది.
- 1996లో సాహిత్య రంగంలో అత్యున్నత అవార్డు జ్ఞానపీఠ అవార్డు లభించింది.
మరణం
90 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండెపోటుతో 2016, జూలై 28 గురువారం న తుది శ్వాస విడిచారు.[1]
మూలాలు
యితర లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads