మాతంగి విజయరాజు
From Wikipedia, the free encyclopedia
Remove ads
మాతంగి విజయరాజు హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్రధారిగా గుర్తింపు పొందారు. దళిత కుటుంబంలో జన్మించిన ఆయన 32 ఏళ్లపాటు ఆరు వేల ప్రదర్శనలు ఇచ్చారు. బాపట్ల మూర్తి రక్షణ నగరం జన్మస్థలం. ఐదో తరగతి చదువుతుండగానే లోహితాస్యుని పాత్రను పోషించి రంగస్థల నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. బాపట్ల సాల్వేషన్ ఆర్మీ హై స్కూల్ లో ఛదివారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదువుతున్న సమయంలో ఎం. రామకృష్ణారావు వద్ద సంగీతం నేర్చుకున్నారు. అంతర కళాశాలల నాటక పోటీల్లో ఉత్తమ నటుడు, దర్శకుడు, పురస్కారాలను పొందారు. గానకోకిలగా బిరుదును పొందారు. విజయరాజుకు భార్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్రను దాదాపు 2 వేల సార్లు పోషించారు. స్థానం నరసింహారావు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, రేబాల రమణ తర్వాత స్త్రీ పాత్రలు పోషించడంలో పేరుగాంచారు. మధుర స్వరం, అసమాన నటనా ప్రతిభతో భావపురి నాటక కళారంగంలో ధ్రువతారగా ఎదిగారు.

Remove ads
మరణం
విజయరాజు గుండెపోటుతో 2011, ఆగష్టు 7 న మరణించారు. ఆయన విగ్రహాన్ని 7.8.2012 న మూర్తి రక్షణనగరంలో సినీనటుడు గిరిబాబు, గోరటి వెంకన్న, గాదె వెంకటరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాయపాటి శ్రీనివాస్ తదితరులు ఆవిష్కరించారు.
ఇవి కూడా చూడండి
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads