మాథ్యూ ఫిషర్

From Wikipedia, the free encyclopedia

మాథ్యూ ఫిషర్
Remove ads

మాథ్యూ డేవిడ్ ఫిషర్ (జననం 1997 నవంబరు 9) ఇంగ్లాండ్ క్రికెట్ ఆటగాడు. అతను యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. 2022 మార్చిలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు [1]

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
Remove ads

కెరీర్

దేశీయంగా

ఫిషర్ 2013 జూన్ 9న లీసెస్టర్‌షైర్‌పై 2013 యార్క్‌షైర్ బ్యాంక్ 40 లో ప్రవేశించాడు/ [2] 15 సంవత్సరాల 212 రోజుల వయస్సులో, పోటీ కౌంటీ గేమ్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడైన క్రికెటరతను. [3] మునుపటి రికార్డు 1922లో వెల్ష్ క్రికెటర్ రాయిస్టన్ గేబ్-జోన్స్ పేరిట ఉంది. [3] 2015 మేలో T20 బ్లాస్ట్‌లో రంగప్రవేశం చేసిన అతను డెర్బీషైర్‌పై యార్క్‌షైర్ తరపున ఐదు వికెట్లు తీశాడు. [4]

ఆట మొదలుపెట్టినప్పటి నుండి ఫిషర్, పక్క నొప్పి, విరిగిన బొటనవేలు, స్థానభ్రంశం చెందిన భుజం, వెన్ను ఒత్తిడి గాయం, పదేపదే వచ్చే స్నాయువు సమస్యలతో సహా అనేక రకాల గాయాలను ఎదుర్కొన్నాడు. ఇవన్నీ కౌంటీ క్రికెట్‌లో అనేక సీజన్లలో అతని ఆటను ప్రభావితం చేశాయి.[5]

2022 ఏప్రిల్ లో, ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం ఫిషర్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కొనుగోలు చేసింది. [6]

అంతర్జాతీయ కెరీర్

ఫిషర్‌ను 2013లో 15 సంవత్సరాల వయస్సులో ఇంగ్లండ్ అండర్ 19 జట్టులో తీసుకున్నారు. అతను 2021 డిసెంబరులో ఆస్ట్రేలియా A జట్టుతో ఆడిన ఇంగ్లాండ్ లయన్స్ జట్టుకు కూడా ఆడాడు [5]

2022 ఫిబ్రవరిలో, ఫిషర్ వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం ఇంగ్లాండ్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. [7] 2022 మార్చి 16 న ఇంగ్లండ్ తరపున వెస్టిండీస్‌పై టెస్టు రంగప్రవేశం చేశాడు.[8]

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads