మాథ్యూ బ్రీట్జ్కే

From Wikipedia, the free encyclopedia

Remove ads

మాథ్యూ బ్రీట్జ్కే (జననం 1998 నవంబరు 3) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు.[1] అతను 2017 ఫిబ్రవరి 9న 2016–17 సన్‌ఫోయిల్ 3-డే కప్‌లో తూర్పు ప్రావిన్స్‌ తరఫున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసాడు.[2] 2017 ఫిబ్రవరి 12న 2016–17 CSA ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో తూర్పు ప్రావిన్స్‌ తరఫునే తన తొలి లిస్టు A మ్యాచ్ కూడా ఆడాడు.[3] 2017 సెప్టెంబరు 1న 2017 ఆఫ్రికా T20 కప్‌లో తన తొలి ట్వంటీ20 ఆట కూడా తూర్పు ప్రావిన్స్ తరపునే ఆడాడు.[4]

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...

డిసెంబరు 2017లో, అతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికయ్యాడు.[5] 2018 జూలైలో క్రికెట్ సౌత్ ఆఫ్రికా ఎమర్జింగ్ స్క్వాడ్‌లోకి అతన్ని తీసుకున్నారు.[6] 2018 సెప్టెంబరులో, 2018 ఆఫ్రికా T20 కప్ కోసం తూర్పు ప్రావిన్స్ జట్టుకు ఎంపికయ్యాడు.[7]

2019 సెప్టెంబరులో మాథ్యూ, 2019 ఎంజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం నెల్సన్ మండేలా బే జెయింట్స్ జట్టుకు ఎంపికయ్యాడు.[8] 2021 ఏప్రిల్‌లో, నమీబియాలో ఆరు-మ్యాచ్‌ల పర్యటన కోసం దక్షిణాఫ్రికా ఎమర్జింగ్ పురుషుల జట్టులో ఎంపికయ్యాడు.[9] అదే నెలలో, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు తూర్పు ప్రావిన్స్ జట్టుకు ఎంపికయ్యాడు.[10]

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads