మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
From Wikipedia, the free encyclopedia
Remove ads
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి 2023లో విడుదలైన భారతీయ తెలుగు భాషా రొమాంటిక్ కామెడీ చిత్రం, మహేష్ బాబు పచ్చిగొల్ల రచన మరియు దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ బ్యానర్‌పై వి.వంశీ కృష్ణ రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టి నటించారు.
ఈ చిత్రం 2021 మార్చిలో అధికారికంగా ప్రకటించబడింది, తరువాత ఈ చిత్రం పేరు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అని వెల్లడైంది. ఈ చిత్రానికి సంగీతం రథన్ (పాటలు) మరియు గోపీ సుందర్ (స్క్రోల్) స్వరపరిచారు, సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్‌ను వరుసగా నీరవ్ షా మరియు కోటగిరి.వి నిర్వహించారు.
ఇది 2023 సెప్టెంబరు 7న విడుదలైంది మరియు విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.
Remove ads
తారాగణం
- అనుష్క[1]
- నవీన్ పొలిశెట్టి
- జయసుధ
- మురళీ శర్మ
- నాజర్
- తులసి
- హర్ష వర్ధన్
- అభినవ్ గోమఠం
- సోనియా దీప్తి .
- రోహిణి
- రాకేష్ వర్రె
- భద్రం
- మహేష్ ఆచంట
పాటల జాబితా
లేడీ లక్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కార్తీక్
నో నో నో, రచన: అనంత్ శ్రీరామ్, గానం.ఎం ఎం మనసి, లేడీ కష్
హతవిధీ, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం . ధనుష్
ఏ వైపుకు సాగుతుంది, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.శంకర్ మహదేవన్.
దూకే చినుకా, రచన: అనంత్ శ్రీరామ్, గానం.అబ్బీ వి .
కథ
స్వతంత్ర భావాలున్న అన్విత (అనుష్కా శెట్టి) తన తల్లి (జయసుధ) మరణం తర్వాత ఒంటరితనం ఫీలవుతుంది. తనకు ఓ తోడు కావాలని, ఆ తోడు తన బిడ్డ అవ్వాలని అనుకుంటుంది.పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కనాలని అనుకుంటుంది. బిడ్డను కనేందుకు తగిన యువకుడి కోసం వెతుకుతుండగా ఈ క్రమంలో స్టాండప్ కామెడీ చేసే సిద్దూ పొలిశెట్టి ( నవీన్ పొలిశెట్టి) పరిచయమవుతాడు. సిద్దూ అన్విత పెమలో పడుతాడు, కానీ అన్విత నిర్ణయంతో సిద్దూ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. వారిద్దరి ప్రయాణం ఎలా సాగింది? మరి చివరికి ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[2]
విడుదల
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 2023 సెప్టెంబరు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్టోబరు 5 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
సాంకేతిక నిపుణులు
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads