రాజకీయవేత్త
రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ప్రభుత్వ పదవులు ఆశించే వ్యక్తి From Wikipedia, the free encyclopedia
Remove ads
రాజకీయ నాయకుడు లేదా రాజకీయవేత్త, అంటే పార్టీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే వ్యక్తి, లేదా ప్రభుత్వంలో రాజకీయ పదవిని కలిగి ఉన్న లేదా కోరుకునే వ్యక్తి. రాజకీయ నాయకులు భూమి మీద ఏదైనా ప్రాంతాన్ని పరిపాలించే చట్టాలు లేదా విధానాలను ప్రతిపాదించడం, మద్దతు ఇవ్వడం, సృష్టించడం, విస్తరణ ద్వారా ప్రజలుకు మరిన్ని సౌకర్యాలు కలిగించుటలో ప్రభావితంలో పాలు పంచుకునే ఒక వ్యక్తులు అని భావన.వీరిని రాజకీయ నాయకుడను రాజకీయవేత్త. రాజనీతి నిపుణుడు,రాజనీతి కోవిదుడు అని కూడా అంటారు.స్థూలంగా చెప్పాలంటే ఏ రాజకీయ సంస్థలోనైనా రాజకీయ అధికారాన్ని సాధించడానికి ప్రయత్నించే ఎవరైనా "రాజకీయ నాయకుడు" కావటానికి అవకాశం ఉంది.నిర్ణయాలు తీసుకునేందుకు వ్యక్తులు ప్రభుత్వంలో పదవులను కలిగి ఉంటారు. వీరు ఎన్నికల ద్వారా లేదో, వారసత్వం, అధికార ఆక్రమణ, నియామకం, ఎన్నికల మోసం, గెలుపు, లేదా ఇతర మార్గాల ద్వారా ఆ పదవులను కోరుకుంటారు. పొలిటిషన్ పదం పోలిస్ అనే క్లాసికల్ గ్రీకు పదం నుండి ఆవిర్భవించింది.
Remove ads
నిర్వచనం, గుర్తింపు
రాజకీయనాయకుడుకు స్థూలంగా నిర్వచనంఈ విధంగా ఉంది. “ ఏదేని ప్రభుత్వం లేదా చట్టాన్ని రూపొందించే సంస్థలో సభ్యుడుగా ఉన్న వ్యక్తి ” అని చెపుతుంది.[1] రాజకీయ నాయకులు రాజకీయంగా చురుకైన వ్యక్తులు. ముఖ్యంగా పార్టీ రాజకీయాల్లో పాల్గొంటూ ప్రాంతీయ, జాతీయ ప్రభుత్వాల కార్యనిర్వాహక, శాసన కార్యాలయాలు, న్యాయ కార్యాలయాల కలిగి ఉంటారు.[2]
రాజకీయవేత్త వాక్చాతుర్యం
ప్రచార ప్రకటనలలో మాదిరిగా వీరి ప్రసంగాలు ఉంటాయి. రాజకీయ స్థానాలను అభివృద్ధి చేయడానికి వీలు కల్పించే సాధారణ ఇతివృత్తాలను ఉపయోగించడం కోసం వారు ప్రత్యేకంగా నెరవేర్చలేని హామీలతో ఓటర్లను సునాయాసంగా నమ్మిస్తారు.[3] రాజకీయవేత్తలు లేదా రాజకీయ నాయకులు, మీడియా ముందు నిపుణులైన వినియోగదారులుగా మారతారు.[4] రాజకీయ నాయకులు వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు, కరపత్రాలను, అలాగే పోస్టర్‌లను 19వ శతాబ్దంలో ఎక్కువగా ఉపయోగించారు.[5] 20వ శతాబ్దంలో వారు టెలివిజన్‌లలోకి ప్రవేశించారు. టెలివిజన్ వాణిజ్య ప్రకటనలను ఎన్నికల ప్రచారంలో అత్యంత ఖరీదైన భాగంగా చేశారు.[6] 21 వ శతాబ్దంలో, వారు ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ల ఆధారంగా సోషల్ మీడియాతో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నారు.[7] రాజకీయాలలో పుకార్లు ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రజలపై ప్రత్యర్థి గురించి ప్రతికూల పుకార్లు ఒకరి సొంత వైపు సానుకూల పుకార్ల కంటే సాధారణంగా చాలా ప్రభావవంతంగా ఉంటాయి.[8]
Remove ads
ఇవి కూడా చూడండి
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads