రాజారామన్న

ఇండియన్ అణు శాస్త్రవేత్త From Wikipedia, the free encyclopedia

Remove ads

రాజారామన్న, (జనవరి 28, 1925 - సెప్టెంబర్ 24, 2004) భారత అణు శాస్త్రవేత్త. భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంచలన విజయాలు సాధించడంలో, అద్భుతమైన ప్రగతిని సాధించడంలో కీలకపాత్ర వహించిన వారిలో డాక్టర్ రాజారామన్న గారు ఒకరు. భారతదేశం అణుబాంబును తయారు చేయడంలో ఈయన కీలకపాత్ర పోషించారు.

త్వరిత వాస్తవాలు డాక్టర్ రాజా రామన్న, జననం ...
Remove ads

జననం

కర్ణాటక లోని మైసూర్‌లో 1925, జనవరి 28 నాడు జన్మించిన రాజారామన్న ప్రాథమిక విద్యాభ్యాసం మైసూర్‌లోనే చేశారు. తరువాత బెంగుళూర్‌, మద్రాసు నగరాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి లండన్‌లోని కింగ్స్‌ కాలేజి నుండి అణుభౌతిక శాస్త్రంలో పిహెచ్‌.డి. చేశారు. 1949లో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా రామన్న తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు డా. హోమీ జహంగీర్‌ భాభా సాహచర్యం రాజారామన్నను ఎంతగానో ప్రభావితం చేసింది.

తారాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రం నిర్మాణం డా. హోమీభాభా బాధ్యతలను రాజా రామన్నకు అప్పగించారు. వాటిని రామన్న సమర్ధవంతంగా నిర్వహించారు. భారతప్రభుత్వం హోమీభాభా మరణం తరు వాత అటామిక్‌ ఎనర్జీ కమీషన్‌ ఛైర్మన్‌గా, అటామిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శిగా రాజారామన్నను నియమించింది.

1989 టాటాల ప్రోత్సాహం, ఫ్రాన్స్‌ నుండి ఆర్థిక సహకారం అందడం వలన రాజారామన్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగుళూర్‌లో పరిశోధనా సంస్థను స్థాపించారు.

Remove ads

మరణం

2004, సెప్టెంబర్ 24 న మరణించారు.

రచనలు

  • The Structure of Music in Raga and Western Systems

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads