రామాయణంలో స్త్రీ పాత్రలు
From Wikipedia, the free encyclopedia
Remove ads
భారతీయ సంస్కృతికి ఆకరములు అనదగిన మహాభారత, రామాయణాది కావ్యాలలో రామాయణం ఒక విశిష్ట గ్రంథం. హిందువులకు భగవద్గీత మాదిరి ఇది కూడా ఒక ప్రమాణ గ్రంథం. చతుర్విధ పురుషార్థాలను బోధిస్తుంది కనుక దీనిని ఇతిహాసం అనీ, వాల్మీకి చేత వ్రాయబడింది కనుక ఆదికావ్యమనీ అంటారు. ఈ గ్రంథం శ్రీరాముని చరిత్రను చెబుతున్నది కనుక రామాయణం అనీ, సీత చరిత్రను వర్ణిస్తుంది కనుక సీతాయాశ్చరితమని, రావణుని వధ గురించి చెబుతున్నది కనుక పౌలస్త్యవధ అనీ పిలువబడుతున్నది. ఈ కావ్యంలో అనేక దేవ, మానవ, వానర, రాక్షస పాత్రలు ఉన్నాయి. వాటిలోని స్త్రీ పాత్రలకు సంబంధించిన వివరాలు:
- అంజన - కుంజరుని కుమారై వానర స్త్రీ. కేసరి భార్య. ఆంజనేయుని తల్లి.
- అనసూయ - అత్రి మహర్షి భార్య. సీతకు పతివ్రతాధర్మాలను బోధించింది.
- అరుంధతి - వశిష్ట మహర్షి భార్య.
- అహల్య - గౌతముని భార్య. పతివ్రత. రాముని పాదము సోకగానే శాప విముక్త అయ్యింది.
- ఊర్మిళ - లక్ష్మణుని భార్య, జనక మహారాజు జ్యేష్ట పుత్రిక. భర్త లక్ష్మణుడు అన్న రాముని వెంట అరణ్యాలకు పోయినప్పుడు ఈమె తపస్సాధనలో ఉన్నది.
- కైకసి - రావణుడు, కుంభకర్ణు, విభీషణుల తల్లి.
- కైకేయి - దశరథుని మూడవ భార్య. భరతుని తల్లి.
- కౌసల్య - దశరథుని మొదటి భార్య. రాముని తల్లి.
- ఛాయాగ్రాహిణి - హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.
- జంఝాట
- తాటకి - మారీచ, సుబాహువుల తల్లి. రాక్షసి.
- తార - వాలి భార్య. అంగదుని తల్లి.
- త్రిజట - రావణుడు సీతను ఎత్తుకొని పోయి లంకలో బంధించినప్పుడు ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఒకతె.
- ధాన్యమాలిని - రావణుని రెండవ భార్య. అతికాయుని తల్లి.
- అనల - విభీషణుని కుమార్తె.
- మండోదరి - రావణుడి భార్య. ఇంద్రజిత్తు, తల్లి.
- మంథర - కైకేయి చెలికత్తె. కైకేయికి దుర్బోద చేసి రాముడు అరణ్యవాసం చేయడానికి కారకురాలు అయ్యింది.
- మాండవి - కుశధ్వజుని కుమార్తె. భరతుని భార్య.
- రేణుకాదేవి - జమదగ్ని భార్య. పరశురాముని తల్లి.
- లంకిణి - లంకను కాపలాగా ఉన్న ఒక రాక్షసి .
- వేదవతి - సీత పూర్వజన్మపు పతివ్రత. ఈమెను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు.
- శబరి - రాముని భక్తురాలు. సిద్ధయోగిని. మతంగమహర్షి శిష్యురాలు. రాముని రాకకై ఎదురు చూసిన వృద్ధురాలు.
- శాంత - దశరథుని మిత్రుడైన రామపాదుని కుమార్తె.
- శూర్పణఖ - రావణుని చెల్లెలు. రాముని వనవాస కాలంలో అతనిపై మోజుపడింది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు, పెదాలు కోసివేశాడు.
- శ్రుతకీర్తి - కుశద్వజుని కుమార్తె. శత్రుఘ్నుని భార్య.
- సరమ - విభీషణుని భార్య.
- సింహిక - హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.
- సీత - జనకుడు యాగం చేసి భూమిని దున్నుతుండగా నాగేటి చాలులో లభించింది. రాముని భార్య.
- సునయన - జనక మహారాజు భార్య.
- సుమిత్ర - దశరథుని భార్య. లక్ష్మణ,శత్రుఘ్నుల తల్లి.
- సురస - నాగమాత. హనుమంతునిచే ఓటమి పాలయ్యింది.
- సులోచన - ఇంద్రజిత్తు భార్య




Remove ads
పరిశోధనలు
రామాయణంలో స్త్రీ పాత్రల స్వరూప స్వభావ చిత్రణలను ఇలపావులూరి పాండురంగారావు పరిశోధించి ఆంగ్లంలో Women in Valmiki అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథాన్ని రేవూరి అనంత పద్మనాభరావు తెలుగులో రామాయణంలో స్త్రీ పాత్రలు పేరుతో అనువాదం చేశాడు.
మూలాలు
- Women Characters in Valmiki Ramayana By Kamal Kumar
- భారతీయ సంస్కృతీ సంప్రదాయ నామనిఘంటువు[permanent dead link]
[[వర్గం:పురాణ పాత్రలు]]
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads