రీజా హెండ్రిక్స్

From Wikipedia, the free encyclopedia

రీజా హెండ్రిక్స్
Remove ads

రీజా రాఫెల్ హెండ్రిక్స్ (జననం 1989 ఆగస్టు 14) దక్షిణాఫ్రికా లోని గౌటెంగ్ దేశీయ జట్టుకు, దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టుకూ ఆడుతున్న దక్షిణాఫ్రికా క్రికెటరు. అతను కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. [1] 2014 నవంబరులో దక్షిణాఫ్రికా తరపున తన అంతర్జాతీయ రంగప్రవేశం చేసి, తొలి ఆట లోనే శతకం చేసిన మూడవ దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు. [2]

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
Remove ads

దేశీయ వృత్తి

2017 నవంబరులో హెండ్రిక్స్, 2017–18 రామ్ స్లామ్ T20 ఛాలెంజ్‌లో డాల్ఫిన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లయన్స్ తరఫున 102 నాటౌట్‌ చేసి, ట్వంటీ20 మ్యాచ్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు. [3] అతను ఎనిమిది మ్యాచ్‌లలో 361 పరుగులతో ముగించి, టోర్నమెంటులో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. [4] 2018 జనవరిలో అతను 2017–18 మొమెంటమ్ వన్ డే కప్ చివరి రౌండ్‌లో లిస్టు A సెంచరీ సాధించి, అదే సీజన్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన మూడు ఫ్రాంచైజీ పోటీల్లో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. [5]

2018 జూన్లో, 2018–19 సీజన్‌లో హైవెల్డ్ లయన్స్ జట్టులో హెండ్రిక్స్ జట్టులో ఎంపికయ్యాడు. [6] 2018 అక్టోబరులో, అతను ఎంజాన్సీ సూపర్ లీగ్ T20 టోర్నమెంటు మొదటి ఎడిషన్ కోసం జోజి స్టార్స్ జట్టులో ఎంపికయ్యాడు. [7] [8] MSL 2018లో హెండ్రిక్స్ 410 పరుగులు చేశాడు, తదనంతరం జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. 2019 సెప్టెంబరులో 2019 ఎంజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంటు కోసం జోజి స్టార్స్ జట్టు కోసం జట్టులో ఎంపికయ్యాడు. [9] 2021 ఏప్రిల్లో, అతను దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు గౌటెంగ్ జట్టులో ఎంపికయ్యాడు. [10]


2022 ఏప్రిల్లో, 2021–22 CSA వన్-డే కప్ యొక్క డివిజన్ వన్ ఫైనల్‌లో, హెండ్రిక్స్ లయన్స్ తరపున 157 పరుగులు చేశాడు. దాంతో వారు టైటాన్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకున్నారు. [11]

2022 సెప్టెంబరులో హెండ్రిక్స్‌ను జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ SA20 పోటీ ప్రారంభ సీజన్ కోసం కొనుగోలు చేసింది. ఇది 2023లో జరగాల్సి ఉంది [12]

Remove ads

అంతర్జాతీయ కెరీర్

హెండ్రిక్స్ 2014 నవంబరు 5 న ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా తరపున ట్వంటీ20 అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు.[13] అతను 2015 ఆఫ్రికా T20 కప్ కోసం గ్రిక్వాలాండ్ వెస్టు క్రికెట్ జట్టులో చేరాడు. [14] 2017 ఆగస్టులో T20 గ్లోబల్ లీగ్ మొదటి సీజన్ కోసం ప్రిటోరియా మావెరిక్స్ జట్టులో ఎంపికయ్యాడు. [15] అయితే, 2017 అక్టోబరులో, క్రికెట్ దక్షిణాఫ్రికా ఈ టోర్నమెంటును నవంబరు 2018కి వాయిదా వేసింది, ఆ తర్వాత వెంటనే రద్దు చేసింది. [16]

2018 జూన్లో, హెండ్రిక్స్ శ్రీలంకతో జరిగిన వారి సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులో ఎంపికయ్యాడు. [17] అతను 2018 ఆగస్టు 5న శ్రీలంకపై దక్షిణాఫ్రికా తరపున వన్‌డే రంగప్రవేశం చేసాడు.[18] తొలి వన్‌డే లోనే శతకం చేసిన మూడవ దక్షిణాఫ్రికా బ్యాటరు గాను, ప్రపంచంలో పద్నాలుగో బ్యాటరు గానూ నిలిచాడు.[19] 88 బంతుల్లో చేసిన ఆ శతకం తొలి వన్డేలో ఓ బ్యాటరు చేసిన అత్యంత వేగవంతమైన శతకం. ఆ మ్యాచ్‌లో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. [20] [21]

2021 సెప్టెంబరులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో హెండ్రిక్స్ ఎంపికయ్యాడు. [22]

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads