రుద్రమదేవి (సినిమా)

2015 సినిమా From Wikipedia, the free encyclopedia

Remove ads

రుద్రమదేవి, 2015 లో గుణశేఖర్ రూపకల్పనలో వచ్చిన 3డి చారిత్రక చిత్రం, ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రూపొందినది.[3] అనుష్కశెట్టి, శివ కుమార్ శ్రీపాద, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, విక్రమ్ జీత్ విర్క్, ప్రకాశ్ రాజ్, ఆదిత్య మెనన్, నిత్య మెనన్, బాబా సెహగల్, కాథరీన్ థ్రెసాలతో కూడిన భారీ తారాగణం చిత్రంలో ఉంది.[4] అనుష్క 13వ శతాబ్ది కాకతీయ వంశపు రాణి రుద్రమదేవిగా నటించింది.[5] ఈ సినిమాకి నేపథ్యం సంగీతం, సంగీతం ఇళయరాజా అందిస్తున్నారు [6] తోట తరణి ఆర్ట్ డైరెక్టరుగా పనిచేస్తున్నాడు.[7] నీతా లుల్లా కాస్ట్యూం డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.[8] 2015 అక్టోబరు 09న విడుదల చేసారు.[9]

త్వరిత వాస్తవాలు రుద్రమదేవి, దర్శకత్వం ...
Remove ads

కథ

గణపతిదేవుడి పాలనలో సుభిక్షంగా సాగుతున్న కాకతీయ సామ్రాజ్యంపై శత్రురాజులు కన్నేస్తారు. ఆ సమయంలో మహారాజుకు ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల రాజ్యాధికారానికి అనర్హురాలు. పైగా, శత్రురాజుల దండెత్తే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో -పుట్టిన బిడ్డను రుద్రమదేవుడిగా రాజ్యానికి పరిచయం చేస్తాడు. అలా మొదలైన కథ -అసలు విషయానికి దూరంగా జన్మ రహస్యం పాయింట్ చుట్టూనే తిరిగింది. రుద్రమదేవి జన్మ రహస్యం బహిర్గతం కావడమే -సినిమాకు టర్నింగ్ పాయింట్. తరువాత యుద్ధ వ్యూహాలతో సినిమా పతాక సన్నివేశాలకు వెళ్లిపోయింది. ఖడ్గ విద్యలో నైపుణ్యం, మత్తగజాన్ని లొంగదీయడం, చుట్టుముట్టిన సైనికులను చీల్చిచెండాడటం, శత్రుదుర్భేద్యమైన ఏడుకోటల నిర్మాణం, పన్నుల రద్దుకు సాహసోపేత నిర్ణయం, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, రుద్ర సైన్యం ఏర్పాటులాంటి కీలక సన్నివేశాలున్నాయి.

Remove ads

నిర్మాణం

దర్శకుడు గుణశేఖర్ రాణి రుద్రమదేవి చరిత్రను ఆధారం చేసుకుని స్క్రిప్ట్ తయారుచేసుకున్నారు. అనుష్క, నయనతార, ప్రియాంక చోప్రాలను ప్రధానపాత్రకు ఆలోచించి, చివరకు గతంలో అరుంధతి సినిమాకు గాను అనుష్క చేసిన నటనను బట్టి ఆమెను టైటిల్ రోల్ కి తీసుకున్నారు. గుణశేఖర్ ఇళయరాజాను సంగీతానికి, తోటతరణిని ఆర్ట్ డైరెక్షన్ కు తీసుకున్నారు. సినిమాను 70 కోట్ల రూపాయల బడ్జెట్లో నిర్మించారు.[1][2] మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లను గోనగన్నారెడ్డి పాత్రకు సంప్రదించగా వారిద్దరిలో ఎవరూ అందుకు ముందుకురాలేదు. తర్వాత స్వయంగా శివ కుమార్ శ్రీపాద ఆ పాత్రను పోషించేందుకు ముందుకువచ్చారు. చివరకు అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రకు ఎంపికయ్యాడు.

కథను తెరకెక్కించేందుకు నిర్మాణంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. భారీ బడ్జెట్ సినిమా కనుక -మరో నిర్మాతను రిస్క్‌లో పెట్టకూడదన్న ఆలోచనతో తనే రిస్క్ చేశాడు. చారిత్రక ఘట్టాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించే ప్రయత్నం కనుక -తాను ఆశించింది వచ్చే వరకూ ఆలస్యాన్నీ భరించాడు. చివరకు ‘రుద్రమదేవి’ని విడుదల చేసే విషయంలోనూ -గుణశేఖర్‌ను కష్టాలే చుట్టుముట్టాయి. వాటినీ భరించి, వౌనంగా సహించి.. చివరకు తను స్వప్నాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు.[మూలం అవసరం]

Remove ads

తారాగణం

సాంకేతిక బృందం

  • సంగీతం: ఇళయరాజా
  • కళ: తోట తరణి
  • ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
  • కథ, కథనం, దర్శకత్వం: గుణశేఖర్

చిత్రీకరణ

Thumb
సినిమా చిత్రీకరణ ప్రారంభమైన వేయి స్తంభాలయం

సినిమా చిత్రీకరణ 2013 ఫిబ్రవరి 14న వరంగల్లులో ప్రారంభమైంది. మొదటి షాట్ వరంగల్లు లోని చారిత్రక ప్రదేశమైన వేయిస్తంభాలయంలో చిత్రీకరించారు[10] డాన్స్ డైరెక్టర్ బాబా సెహగల్‌ని ఓ పాత్ర కోసం తీసుకున్నారు.[11]  అశుతోష్ గోవారికర్ ఖేలే హమ్ జీ జాన్ సే (2010)లో నెగెటివ్ పాత్రను పోషించిన విక్రమ్‌జీత్ విర్క్‌, మహదేవ నాయకుడు అన్న నెగెటివ్ పాత్రలో కనిపిస్తున్నాడు. చిత్రీకరణ ఆఖరి షెడ్యూలు జూలై 2014లో ముగిసింది.[12]

Remove ads

విడుదల

చిత్ర అధికారిక ట్రైలర్ ఫిబ్రవరి 2015లో విడుదలైంది. సినిమా 2015 సెప్టెంబరు 09న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలచేయదలచారు. కాని విడుదల కాలేదు. సినిమా ఆడియోను ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణాలోనూ కూడా అక్కడి ముఖ్యమంత్రుల సమక్షంలో విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నారు.  మూడు పాటలు విశాఖపట్నంలోనూ, తర్వాతిరోజు మిగిలిన మూడుపాటలు వరంగల్లు లోనూ విడుదల చేశారు.[13] [14] చివరకు రుద్రమదేవి సినిమా 2015 అక్టోబరు 9 న విడుదల అయింది. (సాక్షి, తే. 9-10-2015).

Remove ads

సంగీతం

పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇళయరాజా స్వరపరిచారు. సినిమా ఆడియోలో 6 పాటలు ఉండగా, 3 పాటలు ఉగాది నాడు విశాఖపట్నంలోనూ, మిగిలిన మూడుపాటలు తర్వాతిరోజు వరంగల్లు లోనూ విడుదల చేశారు.[15] దక్కన్ మ్యూజిక్ రుద్రమదేవి పాటలను బెస్ట్ తెలుగు ఆల్బం ఆఫ్ మార్చి 2015గా గుర్తించింది.[16]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads