వంశీ మూతా
From Wikipedia, the free encyclopedia
Remove ads
వంశీ మూతా భారత-అమెరికన్ వైద్యుడు, శాస్త్రవేత్త. ఈయన గణన జీవ శాస్త్రవేత్త. ఈయన హొవార్డ్ హ్యూగ్స్ మెడికల్ ఇనిస్టిట్యూట్ లో పరిశోధకుడు. "హార్వర్డ్ మెడికల్ స్కూల్" లో సిస్టమ్స్ బయాలజీ, మెడిసన్ లో ప్రొఫెసర్ గా యున్నారు. ఈయన బ్రాడ్ ఇనిస్టిట్యూట్ లో సీనియర్ అసోసియేటివ్ సభ్యునిగా యున్నారు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈయనకు 2004 లో మైటోకాండ్రియా బయాలజీ, జెనోమిక్స్ లో చేసిన పరిశోధనలకు గానూ మాకార్చూర్ పౌండేషన్ గిన్నిస్ అవార్డు లభించింది. 2008 లో అమెరికన్ ఫిలొసాఫికల్ సొసైటీ నుండి తాను చేసిన విశేషమైన క్లినికల్ పరిశోధనలకు గానూ "డాలండ్ ప్రైజ్" లభించింది. 2014 లో భారత దేశ నాల్గవ అత్యున్నత పురస్కారం అయిన పద్మశ్రీ అవార్డును పొందారు. ఈ అవార్డును ఆయన చేసిన బయోమెడికల్ పరిశోధనలకు గాను భారత ప్రభుత్వం అందజేసింది.
ఈయన స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో "బేచులర్ ఆఫ్ సైన్స్" ను గణీత, గణన శాస్త్రములందు చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎం.డి ని పొందారు.
అతను బోస్టన్‌లోని బ్రిగ్‌హామ్ లోని ఉమెన్స్ హాస్పిటల్‌లో ఇంటర్న్ మెడిసిన్‌లో ఇంటర్న్‌షిప్ , రెసిడెన్సీని పూర్తి చేశాడు, ఆపై వైట్‌హెడ్ ఇన్స్టిట్యూట్ / ఎంఐటి సెంటర్ ఫర్ జీనోమ్ రీసెర్చ్‌లో పోస్ట్‌డాక్టోరల్ శిక్షణ పొందాడు.
అతను అమెరికాలోని టెక్సాస్లోని బ్యూమాంట్లో పెరిగాడు.
Remove ads
మూలాలు
ఇతర లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads