వయాగ్రా

From Wikipedia, the free encyclopedia

వయాగ్రా
Remove ads

వయాగ్రా ఒక అల్లోపతి ఔషధము. దీని అసలు పేరు సిల్డినాఫిల్ సిట్రేట్ . పురుషుల్లో అంగస్తంభన లోపాన్ని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక మందు ఇది! అమెరికా ఎఫ్‌డీఏ దీనికి అనుమతినిచ్చి 2014 నాటికి సరిగ్గా పదేళ్లవుతోంది. ఈ దశాబ్దకాలంలో అంతర్జాతీయంగా ఇది సృష్టించిన సంచలనానికి అంతులేదు.

త్వరిత వాస్తవాలు వ్యవస్థాత్మక (IUPAC) పేరు, Clinical data ...
Remove ads

నేపధ్యము

1998 మార్చి 27న ఎఫ్‌డీఏ అనుమతి పొందిన వయాగ్రా.. ఈ పదేళ్లలో ఎన్నో చర్చలకు.. మరెన్నో సంచలనాలకు కేంద్రబిందువైంది. సరికొత్త పరిశోధనలే కాదు.. ఎన్నో హెచ్చరికలు, వివాదాలు కూడా దీని చుట్టూ ముసురుకున్నాయి. అయినా అంగస్తంభన లోపానికి (ఎరక్త్టెల్ డిస్‌ఫంక్షన్) సమర్థమైన పరిష్కారంగా పురుష ప్రపంచం రెట్టించిన ఉత్సాహంతో దీన్ని ఆశ్రయించటం చెప్పుకోదగ్గ విశేషం. 1999-2001ల మధ్య ఫైజర్ కంపెనీ కేవలం ఈ మాత్ర మీదే ఏటా 100 కోట్ల డాలర్ల వ్యాపారం చేసిందంటే దీనికి లభించిన ఆదరణ ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

Remove ads

సమస్య

ఒకప్పుడు స్తంభన లోపం వంటి పురుష లైంగిక సమస్యలను చాలా వరకూ మానసిక సమస్యలుగానే పరిగణించి కొట్టిపారేసేవాళ్లు, లేదంటే 'కౌన్సెలింగ్' వంటివి ఇచ్చేవారు. అయితే శాస్త్రీయమైన పరిశోధన, అవగాహనలు పెరిగిన కొద్దీ ఈ సమస్యలను కేవలం మానసిక సమస్యలుగా భావించటం సరికాదనీ, వీటికి శారీరకమైన లోపాలు, సమస్యలు కూడా కారణమవుతున్నాయని గుర్తించారు. ముఖ్యంగా హార్మోన్ సమస్యలు, దీర్ఘకాలిక మధుమేహం, రక్తనాళాల సమస్యలు, నాడుల పనితీరు తగ్గటం వంటి ఎన్నో అంశాలు స్తంభన పటుత్వాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో పురుషుల లైంగిక సామర్ధ్యాన్ని తక్షణం, తాత్కాలికంగా పునరుద్ధరించటంలో వయాగ్రా ముఖ్యపాత్ర పోషిస్తోందని పలువురు సెక్సాలజిస్ట్‌లు అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య దేశాల్లో ఎన్నో జంటలు విడాకుల వరకూ వెళ్లకుండా చూడటంలో కూడా వయాగ్రా ముఖ్య పాత్ర పోషిస్తోంది.

స్తంభన లోపమన్నది ప్రపంచవ్యాప్త సమస్య. ఒక్క అమెరికాలోనే మొత్తం పురుషుల్లో 10 శాతం మందికి స్తంభన లోపాలున్నట్టు అంచనా. 40-70 ఏళ్ల మధ్య వయసు వారిలో కనీసం సగం మంది దీనితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి రుగ్మతలు పెరుగుతున్న నేపథ్యంలో స్తంభన లోపమూ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అవసరాన్ని బట్టి వైద్యుల పర్యవేక్షణలో వయాగ్రా వంటి తక్షణ పరిష్కారాలను ఆశ్రయించవచ్చుగానీ సమస్యకు మూలాల్ని గుర్తించి.. చికిత్స తీసుకోవటం మరింత ముఖ్యం

Remove ads

దుష్ప్రభావాలు

దీనితో రకరకాల దుష్ప్రభావాలూ ఉంటాయనీ, వైద్యుల సిఫార్సు లేకుండా దీన్ని తీసుకోవటం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నది నిపుణుల సలహా. ముఖ్యంగా గుండె జబ్బులున్న వాళ్లు దీన్ని వైద్యుల సిఫార్సు లేకుండా తీసుకోకూడదు. అలాగే దీనితో తలనొప్పి, ఒళ్లంతా ఆవిర్లు వస్తున్న భావన, వికారం, కళ్లు ఎర్రబారటం, కాస్త నీలంగా కనబడటం వంటి దుష్ప్రభావాలు ఉంటాయని రకరకాల అధ్యయనాల్లో గుర్తించారు. ఇవేమంత ప్రమాదకరమైనవి కాకపోయినా అవగాహనతో మెలగటం అవసరం.

శృంగార సమస్యలకు ఏకైక పరిష్కారంగా వచ్చిన అద్భుతమైన మందు వయాగ్రా. కానీ, ఇది ఎక్కువ కాలం వాడితే.. కంటి చూపు దెబ్బతింటుందట. ఈ విషయం తాజా పరిశోధనలలో వెల్లడైంది. అయితే ఇది అందరికీ కాదు. ఒక రకమైన మ్యుటేషన్ ఉన్నవాళ్లకు మాత్రమే ఇలా జరుగుతుందట. రెటీనా నుంచి మెదడుకు కాంతి సంకేతాలను పంపే ఒక ఎంజైమును సిల్డెనాఫిల్ అడ్డుకుంటుంది. వయాగ్రాను మరీ ఎక్కువ డోసుల్లో ఉపయోగించేవాళ్లకు కంటి పరమైన సమస్యలు రావచ్చన్న విషయం ఇంతకుముందు ఔషధ ప్రయోగాలలో కూడా తేలింది.

బాగా ఎక్కువ కాంతిని చూడలేకపోవడం, చూపు మందగించడం, రంగులు కూడా వేరేగా కనపడటం లాంటి సమస్యలు వీళ్లకు రావచ్చని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్కు చెందిన లీసా నివిజన్ స్మిత్ తెలిపారు. రెటినైటిస్ పిగ్మెంటోసా అనే కంటి వ్యాధికి సంబంధించి మ్యుటెంట్ జన్యువు కాపీ ఒక్కటే ఉన్నవాళ్ల విషయంలోనే తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామన్నారు. ఇందుకోసం ముందుగా ఇలా జన్యువు ఒకే కాపీ ఉన్న ఎలుకలకు సిల్డెనాఫిల్ మందు ఇచ్చి చూశారు. ఆ ఎలుకకు చూపు మందగించడం స్పష్టంగా తేలింది. రెటినైటిస్ పిగ్మెంటోసా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. దీనివల్ల చివరకు అంధత్వం వస్తుంది[1].

బయటి లంకెలు

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads