వలస
From Wikipedia, the free encyclopedia
Remove ads
వలస అనగా రుతుక్రమంగా, జంతువులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస పోవడం. ఇది అనేక సందర్భాలలో, అనేక జాతులలో కనబడినా కొన్ని చేపలు, పక్షులు ముఖ్యంగా చెప్పుకోదగినవి. గుడ్లు పెట్టే స్థలాల కోసం, ఆహార సేకరణ కోసం, వాతావరణ అననుకూలత నుంచి తప్పించుకోవడం కోసం ఈ వలసలు జరుగుతాయి.
వలస (ఆంగ్లం Migration) అనగా రుతుక్రమంగా, జంతువులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస పోవడం. ఇది అనేక సందర్భాలలో, అనేక జాతులలో కనబడినా కొన్ని చేపలు, పక్షులు ముఖ్యంగా చెప్పుకోదగినవి. గుడ్లు పెట్టే స్థలాల కోసం, ఆహార సేకరణ కోసం, వాతావరణ అననుకూలత నుంచి తప్పించుకోవడం కోసం ఈ వలసలు జరుగుతాయి.
Remove ads
వలసల వల్ల మానవాభివృద్ధి
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) విడుదల చేసిన మానవ అభివృద్ధి నివేదిక-2009లో భారత్ 134వ స్థానంలో నిలిచింది. మానవ అభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ) 0.612గా నమోదైంది. మొత్తం 184 దేశాలున్న ఈ జాబితాలో 0.971 సూచీతో నార్వే మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా, ఐస్‌లాండ్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. సియెర్రా లియోన్, అఫ్గానిస్థాన్, నిగెర్ దేశాలు జాబితాలో అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. మన పొరుగు దేశాలైన చైనా, శ్రీలంకలు వరుసగా 92, 102 స్థానాలను దక్కించుకున్నాయి. అమెరికా గతేడాదికంటే ఒకమెట్టు దిగి 13వ స్థానంతో సరిపెట్టుకుంది.భారత్‌లో సగటు ఆయుర్థాయం 63.4 ఏళ్లు. మహిళలు సగటున 64.9 ఏళ్లు జీవిస్తుండగా, పురుషులు 62 ఏళ్లే బతుకుతున్నారు.వలసలు సంపద సృష్టికి బాటలు వేస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఉన్న ఊరిని వదిలిపెట్టి వెళ్లినవారు ఐదేళ్లలో పేదరికం నుంచి బయటపడటం ఖాయమని పేర్కొంది.2001-07 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో వలస వెళ్లిన కుటుంబాల్లో సుమారు 50% దారిద్య్రాన్ని అధిగమించినట్లు తెలిపింది.(ఈనాడు6.10.2009)
Remove ads
పక్షుల వలస

చాలా పక్షులు సుదూర ప్రాంతాలకు ఒక నిర్ధిష్టమైన మార్గాలలో వలసపోతాయి. వీటిలో ఎక్కువగా ఉత్తర దిక్కు నుండి చలికాలంలో దక్షిణ దిక్కులోని ఉష్ణ ప్రాంతాలకు వలసపోయి గుడ్లను పెట్టి, పొదిగి, పిల్లలతో తిరిగి వాటి ప్రాంతాలకు తిరిగివస్తాయి.
మూలాలు
Look up వలస in Wiktionary, the free dictionary.
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమీ, హైదరాబాదు.
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads