విజయనగరం
ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా నగరం From Wikipedia, the free encyclopedia
Remove ads
విజయనగరం ఆంధ్రప్రదేశ్ నగరం, విజయనగరం జిల్లా కేంద్రం. ఇక్కడ విజయనగరం కోట, పైడితల్లి అమ్మవారి ఆలయం ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.
Remove ads
చరిత్ర


విజయనగరం జమీందారీ ముఖ్యపట్టణం విజయనగరం. పూసపాటి వంశం వారు దీని పాలకులు. 1754 లో, విజయనగర పాలకుడైన పూసపాటి విజయరామ గజపతి రాజు, ఫ్రెంచి వారితో ఒప్పందం కుదుర్చుకొని, తన పాలన సాగించాడు. కానీ కొంత కాలానికే ఈ సంస్థానం బ్రిటిషు వారి ఏలుబడిలోకి వెళ్ళింది. స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటిషువారి ఏలుబడిలోనే ఉంది.
ప్రపంచప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకంలోని ప్రధాన వేదిక విజయనగరమే! పట్టణంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలు - అయ్యకోనేరు, బొంకులదిబ్బ మొదలైన వాటి ప్రస్తావన ఈ నాటకంలో ఉంది. ఆ నాటక రచయిత గురజాడ అప్పారావు విజయనగరం రాజావారి ఆస్థానంలో ఉద్యోగస్తుడే.
Remove ads
భౌగోళికం
విజయనగరం భౌగోళికంగా 18 ° 07'N 83 ° 25'E / 18,12 ° N 83,42 ° E ప్రాంతంలో ఉంది. ఇది 74 మీటర్ల (242 అడుగులు) సగటు ఎత్తులో ఉంది. విజయనగరం విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యాన ఉంది.
జనాభా వివరాలు
2011 జనాభా ప్రకారం, ఈ నగర జనాభా 227,533. ఇందులో 111,596 మగవారు, 115,937 ఆడవారు ఉన్నారు. 20,487 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఇందులో 5,686 అబ్బాయిలు, 5,315 అమ్మయిలు. ఈ నగరంలో 81.85% అక్షరాస్యతతొ 169,461 మంది అక్షరాస్యులు ఉన్నారు.[2]
పరిపాలన
విజయనగరం పురపాలక సంఘం 1888 లో స్థాపించారు.[1] 2015 డిశెంబరు 9న నగరపాలక సంస్థగా అభివ్రుద్ది చేసాను.[4]విజయనగరం నగరపాలక సంస్థ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
జాతీయ రహదారి 26 జిల్లాలో విజయనగరం, గజపతినగరం, రామభద్రపురం పట్టణాలను అనుసంధానిస్తుంది. విజయనగరం రైల్వే స్టేషన్ దక్షిణతీర రైల్వే జోన్ లో వాల్తేర్ విభాగం పరిధిలోకి వస్తాయి. సమీప విమానాశ్రయం విశాఖపట్నంలో ఉంది. విశాఖ మరియు విజయనగరం కి మధ్యలో సమీపాన్న ఉన్న భోగాపురంలో జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ దశలో ఉంది.
విద్యా సౌకర్యాలు
ప్రముఖ విద్యాసంస్థలు
- మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల.
- మహారాజా కళాశాల, విజయనగరం
- కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్
పర్యాటక ఆకర్షణలు
పైడితల్లి అమ్మవారి ఆలయం, విజయనగరం
ప్రధాన వ్యాసం: పైడితల్లి అమ్మవారి ఆలయం, విజయనగరం
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు విజయనగరం పట్టణంలో 300 ఏళ్లుగా జరుగుతున్నాయి. బొబ్బిలియుద్ధం సమయంలో విజయనగర రాజుల ఆడపడుచైన పైడితల్లి ఆత్మాహుతికి పాల్పడి ఇలవేల్పుగా అవతరించినట్లు భావిస్తారు. అప్పటినుంచి ఆమెను భక్తితో పూజిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులు దీనికి హాజరవుతారు.
విజయనగరం పట్టణం మధ్యలో 'పెద్ద చెరువు' చాలా విశాలమైనది. 18వ శతాబ్దంలో కోట నిర్మాణానికి కావల్సిన మట్టి కోసం దీన్ని తవ్వించారు. ఈ చెరువులోని నీటితో ఆయకట్టు రైతులు ఏటా మూడు పంటలు పండిస్తుంటారు. ఈ చెరువు పశ్చిమ భాగంలోనే పైడిమాంబ విగ్రహం సాక్షాత్కారమైనది. ఈ చెరువులోనే అమ్మవారి తెప్పోత్సవం నిర్వహిస్తారు.
గంట స్తంభం కూడలి
విద్యుచ్చక్తి లేని రోజుల్లో నాటి పురపాలక సంఘం వారు మూడు లాంతర్లు కూడలిలో మూడు వైపులా మూడు హరికెన్ లాంతర్లు ఏర్పాటుచేశారు. రాత్రిపూట నెల్లిమర్ల, ధర్మపురి, గంటస్తంభం దారులలో ఎడ్లబళ్ళుతో వెళ్ళేవారికి, పాదచారుల సౌకర్యార్ధం నెలకొల్పారు. విజయనగర రాజులు అవృతఖానాను పెద్ద పూలకోటలో నిర్మించారు. ఖానా అంటే మదుము అని అవృత అనే ఆంగ్లపదంతో కలిసి రూపొందింది. నీరు బయటకు పోయే మదుము అని దీని అర్ధం. ఇది గంటస్తంభం నమూనాలో ఉంది. పైభాగంలో స్నానానికి అనువుగా పెద్ద తొట్టె ఉంది. క్రిందిభాగంలో నుయ్యి, దిగడానికి మెట్లు ఉన్నాయి. మహారాజులు ఇందులో స్నానాలు చేసేవారని పెద్దలు అంటారు.
రాజావారి కోట
కోట ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని బొంకుల దిబ్బ అంటారు. నాడు ఈ ప్రదేశాన్ని మహారాజులు సైనిక విన్యాసాలకు కవాతులకు వినియోగించేవారు. బంకు అనేది మహారాష్ట్ర పదం దీనికి తలవాకిట పహరా అని అర్ధం. కాలక్రమేణా ఈ బంకులదిబ్బే బొంకులదిబ్బగా రూపాంతరం చెందింది. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఒక ఫ్రెంచి ఇంజినీరు భూగర్భ జలాల్ని బయటకు తెప్పిస్తానని గొట్టాలను తెప్పించి వాటిని ఇక్కడే భూమిలోకి దించాడట. తన ప్రయత్నం విఫలం కావడంతో చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే పారిపోయాడట. ఆ ఇంజినీరు పలికిన బొంకు లేదా అబద్ధం ఆ ప్రదేశానికి స్థిరపడిందంటారు. మహాకవి గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకాన్ని బొంకుల దిబ్బ సీనుతోనే ఆరంభించారు. ప్రస్తుతం ఈ ప్రదేశం కూరగాయల మార్కెట్ గా ఉపయోగపడుతుంది.
విజయనగరం కోట
ప్రధాన వ్యాసం: విజయనగరం కోట

విజయనగర రాజులు మొదట్లో కుమిలి లోని మట్టి కోటలో నివసించేవారు. ఆనంద గజపతి రాజు విజయనగరం కోట నిర్మాణాన్ని సా.శ. 1712-1714 ల మధ్య ప్రారంభించారు. అయిదు విజయాలకు చిహ్నంగా అనగా విజయ నామ సంవత్సరంలో, విజయదశమి, మంగళవారం నాడు (తెలుగులో జయవారం) ఈ కోట నిర్మాణం మొదలైంది. తన కుమారుడు విజయరామ రాజు పేరిట దీనికి 'విజయనగరం' అని పేరు వచ్చింది. అయితే 1717 సంవత్సరంలో ఆనందరాజు పరమపదించగఅ విజయరామరాజు కోట నిర్మాణాన్ని పూర్తిచేశారు.2012 నాటికి 300 సం.లు అయింది.
విజయనగరం కోటను కొండరాళ్లతో నిర్మించారు. ఇది 26 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కోణాల్లో నలుగు పెద్ద బురుజులతో నిర్మితమైనది. కోట చుట్టూ 19,653 చదరపు అడుగుల కందకం తవ్వించారు. నాడు కందకం నిండా నీరు ఉండేది. ఇది సుమారు రెండు ఏనుగులు మునిగేటంత లోతు ఉంటుంది. గోడలు సుమారు 30 అడుగుల ఎత్తు కలిగివున్నాయి.
Remove ads
ప్రముఖులు
- పి.సుశీల, సినీ గాయని
- ఇందుకూరి రామకృష్ణంరాజు
- వి.రామకృష్ణ
- ద్వివేదుల విశాలాక్షి
- శ్రీరంగం నారాయణబాబు
- నిడుదవోలు వేంకటరావు
- న్యాయపతి కామేశ్వరి
- వంకాయల నరసింహం
- మానాప్రగడ శేషసాయి
- పంతుల జోగారావు - కథా రచయిత
- చిర్రావూరి సర్వేశ్వర శర్మ
- పప్పు వేణుగోపాలరావు
- యడ్ల శ్రీనివాసరావు
- పిన్నింటి తపస్వి, క్రికెటర్
విశేషాలు
- చిలుకూరి శాంతమ్మ - ఈమె విశాఖపట్నానికి చెందిన మహిళా ప్రొఫెసర్. ప్రస్తుతం ఆమె వయస్సు (2022) నాటికి 93 సంవత్సరాలు. ఆ వయస్సులోనూ ఆమె విశాఖపట్నం నుండి రోజుకు 60 కి.మీ ప్రయాణించి విజయనగరం లోని ఒక కళాశాలలో విద్యార్థులకు తనకున్న మక్కువతో భౌతిక శాస్త్రంపై పాఠాలు చెపుతుంది.[5][6]
ఇవీ చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads