వి. ఆర్. కృష్ణ అయ్యర్

సుప్రీంకోర్టులో మాజీ న్యాయమూర్తి From Wikipedia, the free encyclopedia

వి. ఆర్. కృష్ణ అయ్యర్
Remove ads

జస్టిస్ కృష్ణ అయ్యర్ గా సుప్రసిద్దుడైన వి. ఆర్. కృష్ణ అయ్యర్ ఒక భారతదేశ న్యాయమూర్తి. ఈయన సేవలకు గానూ భారత ప్రభుత్వము 1999లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత వివరాలు, జననం ...
Remove ads

నేపధ్యము

కేరళలోని పాలక్కడ్ సమీపంలోని వైద్యనాథపురంలోని తమిళ బ్రాహ్మణుల ఇంట 1914 నవంబరు 15న జన్మించిన వైద్యనాథపుర రామకృష్ణయ్యర్..యువకుడిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు భావాలను ఒంటబట్టించుకున్నారు. 1937 నుంచి క్రిమినల్ లాయర్‌గా పేరున్న తండ్రి వి.వి. రామయ్యర్ శిష్యరికంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం అప్పటి మద్రాస్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రపంచంలోనే మొదటిసారిగా కేరళలో ఎన్నికైన ఈఎంఎస్ నంబూద్రిపాద్ కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1965 ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం న్యాయవాద వృత్తిపై దృష్టి పెట్టారు. 1968లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇలా రెండు రంగాల్లో అవిరళ కృషి చేసిన అరుదైన వ్యక్తి అయ్యర్. కాగా, 1957లో ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే కేరళలో భూ సంస్కరణలు అమలయ్యాయి. అలాగే, 1973 నుంచి 1980 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆయన హయాంలోనే బెయిల్ నిబంధనలు సరళమయ్యాయి. విచారణ సందర్భంగా నిందితులకు బేడీలు వేయటాన్ని కూడా అయ్యర్ వ్యతిరేకించారు. భారత న్యాయవ్యవస్థకు అయ్యర్ భీష్మ పితామహుడు వంటి వారని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్ కొనియాడారు. 1975లో ఇందిరాగాంధీని ఎంపీ పదవికి అనర్హురాలిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన షరతులతో కూడిన స్టే ఇచ్చారు. తదనంతర పరిణామాలు దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించేందుకు దారితీశాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో 400 వరకు తీర్పులు వెలువరించి, అందరి దృష్టినీ ఆకర్షించారు. లా కమిషన్ సభ్యునిగా 1971-73 కాలంలో పనిచేశారు. 1987 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్.వెంకట్రామన్ ప్రత్యర్థి వీఆర్ కృష్ణయ్యర్. గుజరాత్ అల్లర్లపై విచారణకు ఏర్పాటైన పౌర సంఘంలో అయ్యర్ కూడా సభ్యునిగా ఉన్నారు. 1999లో ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. 2002 గుజరాత్ అల్లర్లకు నరేంద్రమోదీయే కారణమని అప్పట్లో అయ్యర్ తీవ్ర విమర్శలు చేశారు. కానీ 2013లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని ప్రకటించగా కృష్ణయ్యర్ హర్షం వ్యక్తం చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Remove ads

రచనలు

వి. ఆర్. కృష్ణ అయ్యర్ దాదాపు 105 గ్రంథాలను రచించారు. ఇందులో నాలుగు ట్రావెలాగ్ రచనలు కూడా ఉన్నాయి.ఆయన న్యాయశాస్త్రానికి సంబంధించి 70కి పైగా పుస్తకాలు రాశారు. ‘వాండరింగ్ ఇన్ మెనీ వరల్డ్స్’ ( ISBN 978-81-317-1835-3 ) పేరుతో ఆత్మకథ రాసుకున్నారు .

మరింత సమాచారం గ్రంథము పేరు, సంవత్సరము ...
Remove ads

మరణము

అనారోగ్యం కారణంగా ఆయన్ని 2014 నవంబరు 24న కుటుంబ సభ్యులు కోచిలోని ఒక ప్రైవేట్‌ మెడికల్‌ ట్రస్టు ఆస్పత్రిలో చేర్పించారు. పక్షవాతం, కిడ్నీలు పనిచేయకపోవడం, గుండె, న్యూమోనియా వ్యాధుల కారణంగా 2014 డిసెంబరు 4న జస్టిస్‌ అయ్యర్‌ మరణించారు[3]. వామపక్ష భావాలు గల మేధావిగా, బడుగుల హక్కుల కోసం చట్టాలను పునర్నిర్వచించిన న్యాయకోవిదుడుగా జస్జిస్‌ అయ్యర్‌ గుర్తింపు పొందారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

మూలాలు

బయటి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads