వీరమాచనేని సరోజిని
From Wikipedia, the free encyclopedia
Remove ads
వీరమాచనేని సరోజిని రంగస్థల నటి, తొలితరం బుర్రకథ కళాకారిణి.[1] తెలుగు చలనచిత్ర దర్శకుడు వీరమాచనేని మధుసూదనరావు భార్య. పూర్తిగా మహిళలతో చిన్నారి పాపలు సినిమా తీసి గిన్నిస్ రికార్డులో స్థానం పొందింది.
Remove ads
జీవిత విషయాలు
సరోజిని కృష్ణా జిల్లా, ఆత్మకూరులో జన్మించింది.[2] దర్శకుడు మధుసూదనరావును ప్రేమ వివాహం చేసుకున్న తరువాత మద్రాసులో కొన్నేళ్ళు ఉండి, చివరి రోజులలో హైదరాబాదులో గడిపింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు (వీణా, వాణి).[3]
కళారంగం
విజయవాడలోని అచ్చమాంబ క్లీనిక్ కేంద్రంగా ప్రజానాట్యమండలి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందిన సరోజిని అనేక నాటక ప్రదర్శనల్లో, బుర్రకథ ప్రదర్శనల్లో పాల్గొన్నది. పాటలు కూడా పాడింది. కొండేపూడి రాధ కథకురాలిగా, సరోజిని పృచ్ఛకురాలిగా, తాపీ రాజమ్మ విశ్లేషకురాలిగా ఏర్పడిన కృష్ణాజిల్లా మహిళా బుర్రకథ దళం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు, వీరటాన్య జీవిత చరిత్రలను బుర్రకథలుగా చెప్పేవారు. అల్లూరి బుర్రకథ ద్వారా బ్రిటిష్ వ్యతిరేక ధోరణిని, జాతీయభావాన్నీ పెంపొందించడంలో సరోజిని ముఖ్యపాత్ర పోషించింది.[4]
Remove ads
సినిమారంగం
సరోజిని నిర్వాహకురాలిగా 12మంది మహిళ భాగస్వామ్యంతో 'శ్రీమాతా పిక్చర్స్' అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఆ సంస్థ ద్వారా నటి సావిత్రిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ 1967లో చిన్నారి పాపలు సినిమా నిర్మించింది. ఈ చిత్రానికి సరోజిని కథను అందించగా, గాయని పి.లీల తొలిసారిగా సంగీతం అందించింది. నిర్మాణం, దర్శకత్వం, సంగీతం, నృత్య దర్శకత్వం, కళాదర్శకత్వం మొదలైన విభాగాలను మహిళలే నిర్వహించిన ఈ చిత్రం గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించడమే కాకుండా 1968లో ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందింది.
నిర్మించినవి
మరణం
సరోజిని 1999లో మరణించింది.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads