వేదాంతం రాఘవయ్య
దర్శకుడు, నృత్య కళాకారుడు, నిర్మాత From Wikipedia, the free encyclopedia
Remove ads
వేదాంతం రాఘవయ్య (08జూన్,1919 – 19అక్టోబర్,1971) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
Remove ads
తొలి జీవితం
వేదాంతం రాఘవయ్య కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 08జూన్,1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య వేదాంతం రత్తయ్య శర్మ, రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు.
వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై హైదరాబాదు వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర పసుమర్తి రామలింగశాస్త్రి గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కూచిపూడి నాట్యంలో బి.ఎ. ఎం.ఎ. డిగ్రీలను పొందారు.
రాఘవయ్య నృత్యదర్శకునిగా సినీజీవితాన్ని ప్రారంభించాడు. రైతుబిడ్డ, విప్రనారాయణ[-అయోమయ నివృత్తి పేజీకి వెళ్తున్న ఈ లింకును సవరించాలి-], స్వర్గసీమ, వందేమాతరం సినిమాలకు నృత్యాలను సమకూర్చాడు. ఈయనకు ఆరుగురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. ఈయన భార్య సూర్యప్రభ ప్రముఖ నటి పుష్పవల్లి సోదరి. సూర్యప్రభ కూడా నటే.
Remove ads
పని చేసిన సినిమాలు
- దర్శకత్వం వహించినవి
- శాంతి (1952)
- అన్నదాత (1952)
- దేవదాసు (1953)
- అనార్కలి (1955)
- భలే అమ్మాయిలు (1957)
- సువర్ణసుందరి (1957)
- రహస్యం (1967)
- నటించినవి
- రైతుబిడ్డ (1939)
- గరుడ గర్వభంగం (1943)
- నృత్య దర్శకత్వం చేసినవి
- పల్నాటి యుద్ధం (1947)
- చిత్రానువాదం అందించినవి
- అనార్కలి (1955)
- సువర్ణసుందరి (1957)
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads