శివకుమార్ శర్మ

భారతీయ శాస్త్రీయ సంగీతకారుడు From Wikipedia, the free encyclopedia

శివకుమార్ శర్మ
Remove ads

పండిట్ శివకుమార్‌ శర్మ(1938 జనవరి 13 - 2022 మే 10) భారతదేశానికి చెందిన సంగీత విద్వాంసుడు, సంతూర్ వాయిద్యకారుడు. ఆయన సంగీతరంగంలో సేవలకుగానూ 1991లో పద్మశ్రీ, 2001లో పద్మవిభూషణ్ పురస్కారలతో భారత ప్రభుత్వం సత్కరించింది.

త్వరిత వాస్తవాలు పండిట్ శివకుమార్‌ శర్మ, వ్యక్తిగత సమాచారం ...
Remove ads

వృత్తి జీవితం

పండిట్ శివ కుమార్ శర్మ 1938లో కాశ్మీర్ లో జన్మించి, జమ్మూ కాశ్మీరులోని జానపద వాద్య పరికరం సంతూర్‌ను ఉపయోగించి భారతీయ సంప్రదాయ సంగీతాన్ని వినిపించిన మొట్టమొదటి సంగీతకారుడు. ఆయన జమ్మూ కాశ్మీరు రాష్ట్రం నుంచి తొలి జానపద వాయిద్యకారుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శివ కుమార్ శర్మ 1956లో ‘జనక్‌ జనక్‌ పాయల్‌ బాజే’ సినిమాకు తొలిసారిగా బ్యాక్‌గ్రౌండ్ ‌స్కోర్‌ అందించి, 1960లో ఆయన తన తొలి సోలో ఆల్బమ్‌ను తీశాడు.

పండిట్ శివ కుమార్ శర్మ, పండిట్ హరిప్రసాద్ చౌరాసియాతో కలిసి శివ-హరి పేరుతో ‘సిల్సిలా’, 'ఫాస్లే' , ‘లమ్హే’ , ‘చాందిని’, 'డార్'వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

Remove ads

శిష్యులు

మరణం

84 ఏళ్ల పండిట్ శివ కుమార్ శర్మ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గుండె పోటు రావడంతో ముంబయిలో 2022 మే 10న మరణించాడు. ఆయనకు భార్య మనోరమ, కుమారులు రాహుల్‌ శర్మ,.రోహిత్ శర్మ ఉన్నారు.[3][4]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads