శ్రీనాథ కవిసార్వభౌముడు (1993 తెలుగు సినిమా)
From Wikipedia, the free encyclopedia
Remove ads
శ్రీనాథ కవిసార్వభౌముడు 1993 లో వచ్చిన జీవిత చరిత్ర సినిమా. 15 వ శతాబ్దపు కవి శ్రీనాథుడి జీవితం ఆధారంగా నందమూరి రామకృష్ణ, శ్రీమతి మూవీ కంబైన్స్ పతాకంపై బాపు దర్శకత్వంలో నిర్మించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, జయసుధ, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. దిగ్గజ నటుడు ఎన్టీఆర్ చివరి చిత్రం ఇది. ప్రసిద్ధ తెలుగు హాస్యనటులు ఎ.వి.ఎస్, గుండు సుదర్శన్ లకు తొలి చిత్రం కూడా.[1][2][3][4]
Remove ads
కథ
శ్రీనాథుడు 1365 లో భీమాంబ, మారయ్యలకు జన్మించాడు. అతను కవిసార్వభౌముడని బిరుదు పొందాడు. కొండవీటి రెడ్డిరాజులు, రాచకొండకు చెందిన వెలమలు, విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయలు సహా అనేక మంది రాజుల గౌరవాలు పొందాడు. శ్రీనాథుడు స్త్రీ అందాన్ని ప్రశంసిస్తూ పద్యాలు రాసాడు. రాజుల ప్రాపకంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. కొండవీడుకు చెందిన పెదకోమటి వేమారెడ్డి కొలువులో మంత్రిగా పనిచేసాడు. అతడి సాహిత్య పరాక్రమానికి ప్రతిఫలంగా దేవరకొండ పాలకుడు లింగమనేడు ప్రతిష్ఠాత్మకమైన నందికంత పోతరాజు కఠారిని బహూకరించాడు.
Remove ads
తారాగణం
- శ్రీనాథుడు గా ఎన్‌టి రామారావు
- శ్రీదేవిగా జయసుధ
- రాజా వల్లభ దేవుడు / నలుడుగా రాజేంద్ర ప్రసాద్
- గౌడ డిండిమభట్టుగా సత్యనారాయణ
- పెడకోమటి వేమారెడ్డిగా మిక్కిలినేని
- గుమ్మడి
- నాగయ్యగా రాళ్లపళ్లి
- తమిళ కవిగా ఎ.వి.ఎస్
- గణపతిగా గుండు సుదర్శన్
- యువరాజుగా రాజా
- దమయంతిగా ఆమని
- ప్రత్యేక పాత్రలో సింధుజ
- డిస్కో శాంతి
పాటలు
శ్రీనాథుని రచనలుగా ప్రజాబాహుళ్యంలో ఉండి, ఈ సినిమాలో వాడిన డైలాగులు
- చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచయించితి మరుత్తరాట్చరిత్ర
- దివిజ కవివరు గుండియల్ దిగ్గురన అరుగుచున్నాడు శ్రీనాథు డమర పురికి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads