సింధు భైరవి
కె. బాలచందర్ దర్శకత్వంలో 1985లో విడుదలైన తమిళ సినిమా From Wikipedia, the free encyclopedia
Remove ads
సింధు భైరవి, 1985 నవంబరు 11న విడుదలైన తమిళ సినిమా. కె. బాలచందర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో శివకుమార్, సుహాసిని, సులక్షణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం స్వరపరిచాడు. ఈ సినిమాలోని పాటలను కె. జె. ఏసుదాసు, కె. ఎస్. చిత్ర పాడారు. విమర్శకుల నుండి సానుకూల సమీక్షలు వచ్చాయి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది.[1] ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి, జాతీయ ఉత్తమ సంగీత దర్శకత్వం, జాతీయ ఉత్తమ నేపథ్య గాయని విభాగాల్లో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమా సీక్వెల్ బాలచందర్ నిర్మించిన సహానా అనే టెలివిజన్ సిరీస్ ఫార్మాట్‌లో ఉంది.[2] తెలుగులో కూడా ఇదే పేరుతో విడుదలయింది.
Remove ads
నటవర్గం
- శివకుమార్ (జె.కె. బాలగణపతి)
- సుహాసిని (సింధు)
- సులక్షణ (భైరవి)
- ఢిల్లీ గణేష్ (గురుమూర్తి)
- జనకరాజ్ (గజపతి)
- ప్రతాప్ పోతన్ (సంజీవి)
- టి.ఎస్. రాఘవేంద్ర (న్యాయమూర్తి భారతి కన్నన్)
- మణిమాల (సింధు తల్లి)
- చార్లే (రామానుజం)
- కవితలయ కృష్ణన్ (భారతి కన్నన్ డ్రైవర్)
- ఆర్. సుందరమూర్తి (జెకెబి డ్రైవర్)
పాటలు
ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాడు.[3] నేపథ్య గాయని కె.ఎస్. చిత్రకు మంచి పేరు వచ్చింది.[4] పాడలేను పల్లవైన భాషరాని దానను అనే పాట తమిళ మాతృకకు మొదటి జాతీయ అవార్డు వచ్చింది. ఇళయరాజాకు ఉత్తమ సంగీత దర్శకత్వం కోసం జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది.[5][6][7]
అవార్డులు
1986 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- సిల్వర్ లోటస్ అవార్డు- జాతీయ ఉత్తమ నటి - సుహాసిని
- సిల్వర్ లోటస్ అవార్డు- జాతీయ ఉత్తమ సంగీత దర్శకత్వం - ఇళయరాజా
- సిల్వర్ లోటస్ అవార్డు- జాతీయ ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్ - కెఎస్ చిత్ర
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads