సుశీల్ కొయిరాలా

From Wikipedia, the free encyclopedia

సుశీల్ కొయిరాలా
Remove ads

సుశీల్ కొయిరాలా (1939 ఆగస్టు 12 – 2016 ఫిబ్రవరి 9) నేపాల్ దేశానికి 2014 ఫిబ్రవరి 11 నుండి 2015 అక్టోబరు 10 వరకు ప్రధానమంత్రిగా పనిచేసారు. ఆయన 2010 నుండి నేపాలీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. కొయిరాలా నేపాల్ ప్రధానమంత్రిగా నేపాల్ పార్లమెంటు ద్వారా 2014 ఫిబ్రవరి 9 న ఎన్నుకోబడ్డారు.[1][2] ఆయన 1952లో నేపాలీ కాంగ్రెస్ పార్టీలో చేరి అనేక సేవలు చేసిన అనంతరం 2010లో అధ్యక్షులైనారు.[3]

త్వరిత వాస్తవాలు రాష్ట్రపతి, ముందు ...
Remove ads

వ్యక్తిగత జీవితం

సుశీల్ కొయిరాలా భారతదేశంలోని బెనారస్ లో 1939 ఆగస్టు 12 న బోథ్ ప్రసాద్ కొయిరాలా, కుమినిది కొయిరాలా దంపతులకు జన్మించారు.[3] ఆయన అవివాహితుడు, సాధారణ జీవితాన్ని గడిపారు.[4] ఆయన రాజకీయంగా ప్రసిద్ధులైన కొయిరాలా కుటుంబానికి చెందిన మాత్రికా ప్రసాద్ కొయిరాలా, గిరిజాప్రసాద్ కొయిరాలా, భీష్మేశ్వర్ ప్రసాద్ కొయిరాలా లకు బంధువు. ఆయనకు ముగ్గురు సోదరీమణులు: ద్యుతిదేవ శర్మ (నేపాల్ లోని ప్రథమ రాజకీయపార్టీ అయిన ప్రచండ గోర్ఖా సభ్యుడు రంగనాథ్ శర్మను వివాహమాడారు.[5]), అభయాదేవి శర్మ, శషి శర్మ. ఆయనకు ఐదుగురు సోదరులు: ప్రమోద్ కుమార్ కొయిరాలా, బినోద్ కొయిరాలా, అరుణ కొయిరాలా, అశోక్ కొయిరాలా, బిజయ్ కొయిరాలా.

కొయిరాలాకు 2014లో ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి వచ్చింది.[6] ఆయన ఫిబ్రవరి 9 2016 న ఖాట్మాడూ లోని ప్నూమోనియాలో మరణీంచారు. ఆయన ముందురోజు వరకు ఆరోగ్యంగా ఉండి నిద్రలో మరణించారు.[7]

Remove ads

రాజకీయ జీవితం

నేపాల్ అతి పెద్ద పార్టీ నేపాల్ కాంగ్రెస్ కు నాయకుడైన కొయిరాలా అవివాహితుడు. ఆయన 1954లో రాజకీయాల్లో ప్రవేశించారు. 1960లో రాజరికం రావడంతో ఆయన 16 సంవత్సరాలపాటు భారతదేశంలో రాజకీయ ఆశ్రయం పొందారు. 1973లో విమానం హైజాక్ సంఘటనలో ప్రమేయం ఉండటంతో మూడేళ్లు భారతదేశంలో జైలు శిక్ష అనుభవించారు. నేపాల్ లో రాజరికానికి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజాస్వామ్య పాలన కోసం ఉద్యమించారు. నేపాల్ ప్రజాస్వామ్య దేశంగా అవతరించడంలో కొయిరాలా కీలకపాత్ర పోషించారు. ఆరేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. భారత్ లో కొంతకాలం అజ్ఞాత జీవితం గడిపారు. నేపాల్ ఇటీవల కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు.[8]

Remove ads

మరణం

గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అమెరికాలో చికిత్స చేయించుకుని ఇటీవలే నేపాల్‌లోని ఆయన స్వగ్రామమైన మహారాజ్‌గంజ్‌కి చేరుకున్నారు. ఫిబ్రవరి 9 2016 న మళ్లీ అస్వస్థతకు గురై ఆయన తుదిశ్వాస విడిచారు.[9]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads