సూపర్ ఓవర్ (2021 సినిమా)
ప్రవీణ్ వర్మ దర్శకత్వంలో 2021లో విడుదలైన తెలుగు సినిమా From Wikipedia, the free encyclopedia
Remove ads
సూపర్ ఓవర్, 2021 జనవరి 22న విడుదలైన తెలుగు సినిమా. ఎస్ఏఎస్ పిక్చర్స్ బ్యానర్ లో సుధీర్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ వర్మ దర్శకత్వం వహించాడు.[1][2][3] ఈ సినిమాలో నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా,[4][5] ఎంఆర్ సన్నీ సంగీతం సమకూర్చాడు.[6] ఇది ఆహా ఓటిటి వేదికగా విడుదలయింది.[7]
Remove ads
కథా నేపథ్యం
కాశి (నవీన్ చంద్ర), మధు (చాందిని చౌదరి), వాసు (రాకేందు మౌళి) ముగ్గురు స్నేహితులు. కాశి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ, కన్సల్టెంట్ చేత మోసం చేయబడుతాడు. చేసిన అప్పులు తిరిగి చెల్లించడంకోసం డబ్బు సంపాదించడానికి క్రికెట్ బెట్టింగ్ ప్రారంభిస్తాడు. ఆ బెట్టింగ్ లో 1.7 కోట్లు గెలుస్తాడు. కాశి తన ఇద్దరు స్నేహితులతో కలిసి తన డబ్బును ఎలా సేకరిస్తాడు, ఆ సమయంలో వాళ్ళ ఎదురయ్యే పరిణామాల ఏంటి అనేది మిగతా కథ.
Remove ads
నటవర్గం
- నవీన్ చంద్ర (కాశి)[8]
- చాందిని చౌదరి (మధు)[9]
- అజయ్ (అజయ్)[10]
- వైవా హర్ష (బంగారు రాజు)
- రాకేందు మౌళి (వాసు)
- ప్రవీణ్ (మురళి)
నిర్మాణం
2019 చివరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది. 2020, అక్టోబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్శకుడు ప్రవీణ్ వర్మ మరణించాడు. ఆ తర్వాత సినిమా నిర్మాత సుధీర్ వర్మ పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించాడు.[11][12]
స్పందన
సూపర్ ఓవర్ మంచి థ్రిల్లర్ సినిమా" అని ది హిందూ పత్రికలో సంగీత దేవి రాసింది.[13] నటన, స్క్రీన్ ప్లేలో కొత్తదనం, దర్శకత్వ ప్రతిభ గురించి సాక్షి పత్రిక సినీ విమర్శకుడు రెంటాల జయదేవ ప్రశంసించాడు.[14] "సూపర్ ఓవర్ సినిమా క్రైమ్ థ్రిల్లర్, ఇందులో కథనం బాగుంది, చూడదగిన సినిమా" అని 123 తెలుగు సమీక్షకుడు వ్రాశాడు.[15]
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads